Success Story: ఉద్యోగం కాదని వ్యవసాయంలోకి MBA గ్రాడ్యుయేట్..బీడుభూమిని సాగు చేస్తూ లక్షల్లో ఆదాయం

Published : Oct 01, 2026, 05:21 PM IST

Success Story: లైఫ్ లో సక్సెస్ కావాలంటే పెద్ద పెద్ద ఉద్యోగాలే చేయాలనుకుంటారు. చాలా మంది యువత ఇదే ఆలోచిస్తారు. కానీ ఓ MBA గ్రాడ్యుయేట్ ఉద్యోగం కాదని బీడు భూమి సాగు చేస్తూ ఎంతోమంది యువతకు మార్గదర్శిగా నిలిచారు. ఇప్పుడు లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్నారు.

PREV
15
వ్యవసాయంలో MBA గ్రాడ్యుయేట్ సంచలనం

లైఫ్ లో సక్సెస్ కావాలంటే పెద్ద పెద్ద ఉద్యోగాలే చేయాలనుకుంటారు. చాలా మంది యువత ఇదే ఆలోచిస్తారు. కానీ ఓ MBA గ్రాడ్యుయేట్ ఉద్యోగం కాదని బీడు భూమి సాగు చేస్తూ ఎంతోమంది యువతకు మార్గదర్శిగా నిలిచారు. ఇప్పుడు లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్నారు.

వ్యవసాయం చేయాలంటే సారవంతమైన నేలే కావాలి. బీడు భూమిలో వ్యవసాయం చేయడం అసాధ్యం. కానీ సాధ్యం కానిది సుసాధ్యం చేసి చూపించారు . ఇప్పుడు లక్షల్లో ఆదాయం సంపాదిస్తూ ఎంతోమంది యువతకు మార్గదర్శిగా నిలిచారు. రాజస్థాన్‌కు చెందిన పుర్వా జిందాల్ రాళ్లు, బండరాళ్లతో నిండిన భూమిలో పంటలు పండించవచ్చని నిరూపించారు. 10 ఎకరాల బీడు భూమిని సాగు నేలగా మార్చి..ఇప్పుడు అదే భూమిలో రకరకాల ఆర్గానిక్ కూరగాయలు, పండ్లను సాగు చేస్తున్నారు. అంతేకాదు.. ఈ వ్యవసాయంతో ఏడాదికి లక్షల రూపాయల టర్నోవర్ సాధిస్తున్నారు.

25
MBA చదివి.. వ్యవసాయం వైపు

రాజస్థాన్‌కు చెందిన పుర్వా జిందాల్ 2017లో ముంబైలోని ఎస్‌పీ జైన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్‌లో MBA పూర్తి చేశారు. చదువు తర్వాత కుటుంబానికి చెందిన టెక్స్‌టైల్ వ్యాపారంలో చేరారు. అయితే 2020లో కరోనా మహమ్మారి కారణంగా వ్యాపార రంగంలో అనేక మార్పులు చోటుచేసుకోవడంతో.. పుర్వా కొత్త రంగంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నారు.

అలా ఆమె దృష్టి ఆర్గానిక్ వ్యవసాయం వైపు మళ్లింది. 2021లో భిల్వారా సమీపంలోని 10 ఎకరాల భూమిలో వ్యవసాయం ప్రారంభించారు. అయితే ఆమె ఎంచుకున్న భూమి సాధారణ వ్యవసాయ భూమి కాదు. రాళ్లు, బండరాళ్లు, అడవి మొక్కలతో నిండిపోయి ఉండేది. పంటలు పండించడానికి అనువైన స్థితిలో లేదు.

35
బ్రోకలీ నుంచి స్ట్రాబెర్రీ వరకు..

క్రమంగా ఆ భూమి రూపమే మారిపోయింది. ఒకప్పుడు రాళ్లతో కనిపించిన ప్రాంతం ఇప్పుడు పచ్చని పంటలతో కళకళలాడుతోంది. ప్రస్తుతం ఆమె ఫామ్‌లో బ్రోకలీ, క్యారెట్, ముల్లంగి, కాలీఫ్లవర్, క్యాబేజీ, టమాటా, బఠానీ, పుచ్చకాయ, బెండకాయ వంటి పంటలను సాగు చేస్తున్నారు. వీటితో పాటు స్ట్రాబెర్రీలను కూడా పండిస్తున్నారు.

పండించిన పంటలను కేవలం స్థానిక మార్కెట్‌కు పంపించడంతోనే ఆపకుండా.. నేరుగా వినియోగదారులకు చేరేలా ‘సాఖీ ఆర్గానిక్’ అనే ఫార్మ్-టు-ఫోర్క్ బ్రాండ్‌ను కూడా ఏర్పాటు చేశారు. దీని ద్వారా భిల్వారా, చుట్టుపక్కల ప్రాంతాల్లోని వినియోగదారులకు తాజా ఉత్పత్తులను అందిస్తున్నారు.

45
వ్యవసాయం గురించి తెలియదు.. అయినా వెనక్కి తగ్గలేదు

వ్యవసాయంపై తనకు మొదట్లో ఎలాంటి అనుభవం లేదని పుర్వా చెప్పారు. వ్యవసాయ పద్ధతుల గురించి ఆన్‌లైన్‌లో నేర్చుకుని ఆర్గానిక్ ఫార్మింగ్ నిపుణుల సలహాలు తీసుకున్నారు. ఆ తర్వాత భూమిని దశలవారీగా సాగుకు అనువుగా మార్చారు.

నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచేందుకు ఆవు పేడ, వర్మీకంపోస్ట్, జీవామృతం, నీమాస్త్రం వంటి సహజ పద్ధతులను ఉపయోగించారు. పురుగుల నియంత్రణకు కూడా సహజ పద్ధతులనే ఆశ్రయించారు. నీటిని పొదుపుగా వినియోగించేందుకు డ్రిప్ ఇరిగేషన్‌ను ఏర్పాటు చేశారు. నేలలో తేమను నిలుపుకోవడానికి మల్చింగ్ పద్ధతిని కూడా ఉపయోగించారు.

55
వ్యవసాయంతో లక్షల్లో ఆదాయం

పుర్వా జిందాల్ నిర్వహిస్తున్న కూరగాయల వ్యాపారం ప్రస్తుతం ఏడాదికి సుమారు రూ.25 లక్షల టర్నోవర్ నమోదు చేస్తున్నాంట. ఆర్గానిక్ గ్రోసరీ విక్రయాల ద్వారా నెలకు మరో రూ.1 లక్ష వరకు ఆదాయం వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

రాళ్లతో నిండిన భూమిని సాగుకు అనువుగా మార్చి.. ఆర్గానిక్ వ్యవసాయాన్ని వ్యాపారంగా అభివృద్ధి చేయడం ద్వారా పుర్వా జిందాల్ తనకంటూ ఓ ప్రత్యేక మార్గాన్ని ఏర్పరుచుకున్నారు. వ్యవసాయంపై అవగాహన లేకపోయినా.. నేర్చుకోవాలనే ఆసక్తి, కొత్తగా ప్రయత్నించాలనే ఆలోచన ఉంటే భిన్నమైన అవకాశాలను సృష్టించుకోవచ్చని ఆమె నిరూపించారు.

Read more Photos on
click me!

Recommended Stories