ఆడామగ లైంగికంగా కలవకున్నా పిల్లలు పుడతాయా..! ఇలాంటి జీవులేవో తెలుసా..?

Published : Jun 05, 2026, 04:41 PM IST

లైంగిక కలయిక లేకుండా పిల్లలకు కనడం సాధ్యమా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కొన్ని జీవులు మగతోడు లేకున్నా పిల్లలకు జన్మనిస్తాయి… అలాంటి వింత జీవులేవో తెలుసా..? 

PREV
15
మగతోడు లేేకున్నా పిల్లలకు జన్మనిచ్చే జీవులు...

కేవలం మనుషుల్లోనే కాదు జంతువుల్లోనూ ఆడామగ కలయిక చాలా కామన్... పునరుత్పత్తి కోసం ఇది తప్పనిసరి. మగజీవులతో సంపర్కం జరిపితేనే ఆడ జీవులు గర్భం దాల్చేది, పిల్లలకు జన్మనిచ్చిది. ఏనుగుల నుండి ఎలుకల వరకు ఇదే ప్రక్రియ ఫాలో అవుతాయి... కానీ కొన్ని జీవులు అరుదైన పునరుత్పత్తి వ్యవస్థను కలిగివుంటాయి. అసలు మగ జీవితో సంబంధం లేకుండానే ఆడ జీవులు పిల్లలను కంటాయి.

ఎలాంటి ఫలదీకణ లేకుండా పిల్లలకు జన్మనిచ్చే ప్రక్రియను 'పార్థినోజెనెసిస్ (Parthenogesis) అంటారు. ఇలా లైంగిక చర్య లేకుండా సంతానాన్ని పొందే జీవులేవి..? ఇలా పిల్లల్ని కనడం ఎలా సాధ్యం..? అనేది ఇక్కడ తెలుసుకుందాం.

25
తేనెటీగలు (Honey bees)

తేనెటీగలు అసలు ఆడామగ సంపర్కం లేకుండా ప్రాణం పోసుకుంటాయి. తేనెపట్టులోని రాణి ఈగ మగ తేనెటీగతో కలవకుండానే గుడ్లను పెడుతుంది. ఫలదీకరణం చెందని గుడ్ల నుండి వేలాది మగ తేనెటీగలు (డ్రోన్స్) పుడతాయి.

35
చీమలు, కందిరీగలు

చీమలు (Ants) : ఇవి కూడా పార్థినోజెనిసిస్ ద్వారా తమ సంతానాన్ని వృద్ధి చేసుకుంటాయి. అంటే ఆడమగ చీమల మధ్య కలయిక అనే ప్రక్రియ ఉండదు... అయినా కొత్త చీమలు తండోపతండాలుగా పుట్టుకువస్తాయి.

కందిరీగలు (Wasps) : కందిరీగల్లో కూడా లైంగిక చర్యలు ఉండవు. అయినా పునరుత్పత్తి ప్రక్రియ కొనసాగుతుంది... కొత్త కందిరీగలు పుడుతుంటాయి.

45
కొమోడో డ్రాగన్లు, పాములు

కొమోడో డ్రాగన్లు (Komodo Dragons) : ఆస్ట్రేలియా, ఇండోనేషియా ప్రాంతాల్లో ఉండే భారీ ఆకారం బల్లులే కొమోడో డ్రాగన్స్. ఇవి కూడా పార్థినోజెనిసిస్ ద్వారానే అంటే మగ జీవి లేకపోయినా ఆడ జీవులు సంతానాన్ని కనగలవు.

పాములు (Snakes) : కొన్ని రకాల కొండచిలువలు (రెటిక్యులేటెడ్ వంటివి) కూడా మగ తోడు లేకుండా పిల్లలకు జన్మనిస్తాయి. ఈ పాములు తోడు లేకుండానే గుడ్లు పెడతాయి... వాటిని పొదిగి పిల్లలను ఉత్పత్తి చేస్తాయి.

55
సొరచేపలు (Sharks)

సముద్ర జీవుల్లో కూడా ఈ పార్థినోజెనిసిస్ కనిపిస్తుంది. ముఖ్యంగా బ్లాక్‌టిప్, జీబ్రా షార్క్ వంటి కొన్ని షార్క్ జాతులలో మగ షార్క్ తో సంబంధం లేకుండా ఆడ షార్క్ పిల్లలకు జన్మనిస్తుంది. .

Read more Photos on
click me!

Recommended Stories