Waterless Washing machine: చుక్క నీరు అక్కర్లేని వాషింగ్ మెషీన్.. దుస్తులు చక్కగా ఉతికి పొడిగానే అందిస్తుంది

Published : Oct 11, 2026, 09:01 AM IST

Waterless Washing machine: ఇప్పుడు మనదేశంలో వాడే వాషింగ్ మెషీన్లకు నీరు చాలా అవసరం. కానీ నీరు అవసరం లేని వాషింగ్ మెషీన్లు అమెరికా వంటి దేశాల్లో వాడుతున్నారు. అవి మన దేశానికి అవసరం. నీరు అవసరం లేని వాషింగ్ మెషీన్లు ఎలా పనిచేస్తాయో తెలుసుకోండి.

PREV
13
నీరు అవసరం లేని వాషింగ్ మెషీన్

నీటి కష్టాలు ప్రతిచోటా పెరిగిపోతున్నాయి. నగరాలు, పల్లెలు అనే తేడా లేకుండా తాగునీరు లేక అల్లాడుతున్నాయి. ఇక ఇలాంటి పరిస్థితుల్లో వాషింగ్ మెషీన్లు దుస్తులు ఉతకడానికి ఎక్కువ మొత్తంలో నీరు ఖర్చవుతోంది. సాధారణ వాషింగ్ మెషీన్ ఒక్కసారి బట్టలు ఉతకడానికే దాదాపు 150 లీటర్ల నీటిని తీసుకుంటుంది. పట్టణ ప్రాంతాల్లో చాలా కుటుంబాలు ట్యాంకర్ నీటిపై ఆధారపడుతున్నాయి. ట్యాంకర్లకు భారీగానే ఖర్చు చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఒక్క చుక్క నీరు కూడా లేకుండా దుస్తులు ఉతికే వాషింగ్ మెషీన్ ఉంటే ఎలా ఉంటుంది. అలాంటి వాషింగ్ మెషీన్లు ఇప్పుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. ‘లిక్విడ్ కార్బన్ డయాక్సైడ్’ సాంకేతికతతో నీరు అవసరం లేకుండా దుస్తులను తెల్లగా మెరిపించేసే వాషింగ్ మెషీన్లు వచ్చేస్తున్నాయి. అమెరికా వంటి దేశాల్లో ఇప్పటికే ఎంతో మంది వీటిని వాడుతున్నారు.

23
ఎలా పనిచేస్తుంది?

ఈ విధానంలో నీరు, డిటర్జెంట్లు వాడకుండా పీడనంతో కూడిన ద్రవ రూప కార్బన్ డయాక్సైడ్‌ను బట్టల శుభ్రత కోసం ఉపయోగిస్తారు. ఇది దుస్తుల్లోని మురికి, జిడ్డు, నూనె మరకలను క్షణాల్లో కరిగించి బయటకు తీస్తుంది. నీరు తగలకపోవడం వల్ల దుస్తుల నాణ్యత దెబ్బతినకుండా ఎక్కువ కాలం మన్నుతాయి. అంతేకాకుండా ఉతికిన వెంటనే దుస్తులు పొడిగా మారి బయటకు వస్తాయి కాబట్టి డ్రైయర్ అవసరం ఉండదు, విద్యుత్ కూడా ఆదా అవుతుంది. యంత్రంలో ఉపయోగించే కార్బన్ డయాక్సైడ్ ఎప్పటికప్పుడు రీసైకిల్ అవుతూ ఉండటం వల్ల వాతావరణానికి ఎలాంటి హానీ కలగదు. అమెరికాలో పెద్ద బ్రాండ్లు ఈ పద్ధతినే వాడుతూ పాత దుస్తులను శుభ్రం చేసి రీసైక్లింగ్ చేస్తున్నాయి.

33
మన దేశానికి ఎంతో అవసరం

మన దేశంలో హోటళ్లు, ఆసుపత్రులు, అపార్ట్‌మెంట్లు, ఆర్మీ క్యాంపుల్లో ఇలాంటి వాషింగ్ మెషీన్లు వాడితే ఎంతో నీరు ఆదా అవుతుంది. ఒక్కో అపార్ట్‌మెంట్ లేదా కాలనీకి ఒక లాండ్రీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే దాదాపు వంద కుటుంబాల వరకు సులభంగా సేవలు పొందవచ్చు. దేశవ్యాప్తంగా ప్రజలు ఇలాంటి వాషింగ్ మెషీన్లు వాడితే ఏటా దాదాపు 10 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని ఆదా చేయవచ్చని అంచనా. యంత్రాల దిగుమతి ఖర్చులు కాస్త ఎక్కువగానే ఉన్నప్పటికీ, ‘మేక్ ఇన్ ఇండియా’ కింద స్థానికంగా వీటిని తయారు చేస్తే పరిశ్రమలకు, సామాన్యులకు ఎంతో లాభదాయకంగా మారుతుంది. ఇది నీటి సంక్షోభాన్ని తగ్గించడమే కాకుండా దేశంలో సరికొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories