ఎలుక ఎక్కడ దాచిందంటే..
సీసీటీవీ ఫుటేజీలో ఓ ఎలుక ఉంగరాలను, చైన్లను నోటకరచుకుని తీసుకెళ్తున్న దృశ్యం కనిపించింది. సీసీటీవీ చూసిన తర్వాత, షాపు సిబ్బంది ఆ ఎలుక వెళ్లిన దారిని వెతకగా, నగలు దాని రంధ్రంలో దొరికాయి ఎలుక తన కన్నంలో 10 ఉంగరాలు, 3 గొలుసులను దాచిపెట్టింది. చివరికి ఆభరణాలు దొరకడంతో నగల షాపు యజమాని, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.