జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్‌లో ఉన్న ఈ ఆలయం అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. తుంగభద్ర, కృష్ణా నధులు సంగమించే ప్రాంతానికి సమీపంలో ఉన్న ఈ చారిత్రక ఆలయం చాళుక్యుల కాలం నాటి అద్భుతమైన శిల్పకళకు ప్రతీకగా నిలుస్తుంది.
రామప్ప దేవాలయం (పాలంపేట)
ములుగు జిల్లాలోని రామప్ప ఆలయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచ ప్రఖ్యాత యునెస్కో (UNESCO) గుర్తింపు పొందిన ఈ దేవాలయం కాకతీయుల అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనం. ఇక్కడ నీటిలో తేలే ఇటుకలతో నిర్మించిన నిర్మాణాలు ప్రతి ఒక్కరినీ విస్మయానికి గురిచేస్తాయి.
ఈ చారిత్రక, ఆధ్యాత్మిక క్షేత్రాలే కాకుండా తెలంగాణలో రామగిరి ఖిల్లా, కొమురవెల్లి మల్లన్న ఆలయం, కురవి వీరభద్ర స్వామి ఆలయం, వరంగల్ భద్రకాళీ ఆలయం, మొదలైన ఎన్నో దివ్య ప్రదేశాలు మన సంస్కృతికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి. వీకెండ్స్‌లో లేదా సెలవులలో సందర్శన మనసుకు ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. కుటుంబంతో కలిసి ఈ అద్భుత క్షేత్రాలను సందర్శించి తరించండి.