Viral Video: శ్మశానం నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టిన మహిళ, వణికిపోయిన డెలివరీ బాయ్

Published : Feb 04, 2026, 04:53 PM IST

Viral Video: సోషల్ మీడియాలో ఇప్పుడు ఎన్నో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ మధ్యన డెలివరీ బాయ్ వీడియో కూడా వైరల్ అయింది. ఒక మహిళ స్మశానం నుంచి ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ పెట్టినట్టు ఆ వీడియో ద్వారా అర్థమవుతుంది. 

PREV
13
స్మశానం నుంచి ఆర్డర్

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఒక వీడియో ఇప్పుడు ఎంతోమందిని భయపెడుతోంది. ఈ వీడియోలో ఒక డెలివరీ బాయ్ కు స్మశానం నుంచి ఫుడ్ ఆర్డర్ వచ్చినట్టు తెలుస్తోంది. ఆ డెలివరీ బాయ్ లొకేషన్ కు వెళ్లి ఆమెకు ఫోన్ చేస్తే ఆమె స్మశానంలో ఉన్నానని తీసుకొని రమ్మని చెప్పినట్టు ఆ వీడియో ద్వారా అర్థం అవుతుంది. రాత్రి చీకట్లోనే, నిశ్శబ్ధంగా ఉన్న స్మశానంలోకి డెలివరీ చేయడానికి భయపడిన ఆ డెలివరీ బాయ్ అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు అర్థమవుతోంది. సోషల్ మీడియాలో ఈ పోస్టు ఇప్పుడు బాగా వైరల్ గా అయ్యింది.

23
స్మశానంలోకి రండి

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోను బట్టి డెలివరీ బాయ్ ఫోన్లో ఒక మహిళతో మాట్లాడతాడు. ‘మీరు చెప్పిన చోటుకు వచ్చాను. కానీ ఏ స్మశానవాటిక గేట్ లా ఉంది’ అని అంటాడు. దానికి ఒక మహిళ చాలా కూల్ గా స్పందిస్తూ ‘నేరుగా లోపలికి రండి. భయపడాల్సిన అవసరం లేదు. అక్కడ ఒక కుక్క ఉంటుంది. అది మిమ్మల్ని ఏం చెయ్యదు’ అని చెబుతుంది. అయితే డెలివరీ బాయ్ రాత్రివేళ స్మశానంలోకి నేను రాలేనని చెబుతాడు. చాలా చీకటిగా ఉంది లోపలికి వెళ్లడానికి నాకు భయం.. గేటు దగ్గరికి వస్తే మీకు ఆర్డర్ ఇచ్చేస్తాను అని చెబుతాడు. అయితే ఆ మహిళ మాత్రం ఫోన్లో మీకు దయ్యాలంటే భయమా అని ప్రశ్నిస్తుంది. అయినా సరే డెలివరీ బాయ్ నేను లోపలికి రాలేనని కరాఖండిగా చెప్పేస్తాడు. ఆమెకు ఫుడ్ డెలివరీ ఇవ్వకుండానే వెళ్ళిపోయినట్టు ఆ వీడియో ద్వారా అర్థమవుతుంది.

33
వ్యూస్ కోసమే చేశారా?

ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టగానే విపరీతంగా వైరల్ అయిపోయింది. అయితే ఈ వీడియో పై ఎంతో మంది రకరకాలుగా స్పందించారు. కొంతమంది డెలివరీ బాయ్ ని సమర్ధించారు. ఎక్కడైనా కూడా భద్రత ముఖ్యమని, రాత్రి వేళలో స్మశానంలోకి వెళ్లడానికి ఎవరికైనా భయమేనని కామెంట్లు పెట్టారు. మరికొంత మంది మాత్రం మహిళ ప్రవర్తనను తప్పుపట్టారు. ఇలా ఇతరులను భయపెట్టడానికి చేసి ఉంటారని, ప్రాంక్ వీడియో కూడా అయి ఉంటుందని చెప్పారు. మరికొందరు కేవలం వ్యూస్ కోసమే ఇలా ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఉంటారని అనుమానం కూడా వ్యక్తం చేశారు. ఇది స్క్రిప్ట్ ప్రకారం చేసిన వీడియో అయి ఉంటుందని ఎంతో మంది అభిప్రాయం పడ్డారు. ఏది ఏమైనా కూడా ఈ వీడియో మాత్రం ఒక్కసారిగా సోషల్ మీడియాలో పెద్ద సంచలనాన్ని సృష్టించింది.

Read more Photos on
click me!

Recommended Stories