DMart Offers : MRP తో పనేలేదు.. డీమార్ట్‌లో అతితక్కువ ధరకు దొరికే 10 వస్తువులు ఇవే

Published : Sep 17, 2026, 04:53 PM ISTUpdated : Sep 17, 2026, 04:58 PM IST

డీమార్ట్‌లో కేవలం కిరాణా సరుకులే కాదు.. బెడ్‌షీట్లు, టవల్స్, కిచెన్ కంటైనర్ల లాంటి ఇంటికి కావాల్సిన చాలా వస్తువులు తక్కువ ధరకే దొరుకుతాయి. ఇలా బయట మార్కెట్లో కంటే అతి తక్కువ ధరకే డీమార్ట్ లో లభించే వస్తువులేవో తెలుసుకుందాం.

PREV
16
1. కిరాణా సరుకులపై ఇంత ఆదా చేయొచ్చా?

మనం రెగ్యులర్‌గా కొనే కిరాణా సరుకుల ఎమ్మార్పీకి, డీమార్ట్ ధరకు చాలా తేడా ఉంటుంది. ఇలా తక్కువ ధరకు దొరికే వస్తువులు, ఎంత డబ్బు ఆదా అవుతుందో తెలుసుకుందాం.

ఆశీర్వాద్ గోధుమ పిండి – 10 కిలోలు

ఎమ్మార్పీ : ₹612

డీమార్ట్ ధర : ₹545

ఆదా : ₹67

అలాగే పప్పు దినుసుల మీద కూడా మంచి డిస్కౌంట్ ఉంటుంది. ఉదాహరణకు డీమార్ట్ ప్రీమియా కందిపప్పు 1 కిలో ₹155కి అమ్ముతున్నారు (ఇది డీమార్ట్ సొంత బ్రాండ్).

ఎమ్మార్పీ ₹197.

ఎమ్మార్పీ : ₹197

డీమార్ట్ ధర : ₹155

ఆదా: ₹42

బియ్యం, పప్పులు, పిండి లాంటివి మనం తరచుగా కొంటుంటాం. వీటిపై వచ్చే చిన్న చిన్న డిస్కౌంట్లు కూడా నెలవారీ బడ్జెట్‌లో పెద్ద మొత్తమే ఆదా చేస్తాయి.

26
2. వాషింగ్ పౌడర్, లిక్విడ్స్ పై ఇంత డిస్కౌంటా..!

ఇంట్లోకి ఎప్పుడూ కావాల్సిన వస్తువుల్లో వాషింగ్ పౌడర్, లిక్విడ్ డిటర్జెంట్ చాలా ముఖ్యమైనవి. వీటి ధరలు బయట మార్కెట్లో, డీమార్ట్ లో ఎలా ఉన్నాయో చూద్దాం.

రిన్ వాషింగ్ పౌడర్ – 7 కిలోలు

ఎమ్మార్పీ: ₹760

డీమార్ట్ ధర: ₹570

ఆదా: ₹190

వాషింగ్ మెషీన్ వాడేవాళ్ల కోసం సర్ఫ్ ఎక్సెల్ మ్యాటిక్ లిక్విడ్ – 4 కిలోలు బెస్ట్ ఉదాహరణ.

ఎమ్మార్పీ: ₹770

డీమార్ట్ ధర: ₹515

ఆదా: ₹255

అంటే, మీరు రెగ్యులర్‌గా వాడే బ్రాండ్ అయితే, ఒకేసారి పెద్ద ప్యాకెట్ కొంటే ₹200కి పైగా ఆదా చేయొచ్చు. అయితే మీది టాప్ లోడ్ వాషింగ్ మెషీనా, ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీనా అనేది చూసుకుని దానికి తగ్గ లిక్విడ్ ఎంచుకోండి.

36
3. కొబ్బరి నూనె, టూత్‌పేస్ట్, కాఫీ... రోజువారీ వస్తువులపైనా సేవింగ్స్!

డీమార్ట్‌లో మనం రోజూ వాడే పర్సనల్ కేర్ వస్తువులు కూడా ఎమ్మార్పీ కంటే తక్కువకే దొరుకుతాయి.

పారాచూట్ కొబ్బరి నూనె – 1 లీటర్

ఎమ్మార్పీ: ₹575

డీమార్ట్ ధర: ₹455

ఆదా: ₹120

కోల్‌గేట్ మ్యాక్స్‌ఫ్రెష్ టూత్‌పేస్ట్ – 300 గ్రాములు

ఎమ్మార్పీ: ₹280

డీమార్ట్ ధర: ₹181

ఆదా: ₹99

కాఫీ తాగేవాళ్ల కోసం, ప్రస్తుతం డీమార్ట్‌లో నెస్కాఫే క్లాసిక్ 45 గ్రాములు ₹179కి అమ్ముతున్నారు. దీని ఎమ్మార్పీ ₹230.

ఎమ్మార్పీ: ₹230

డీమార్ట్ ధర: ₹179

ఆదా: ₹51

ఇక్కడో ముఖ్యమైన విషయం ఏంటంటే.. నెస్కాఫే సన్‌రైజ్, నెస్కాఫే క్లాసిక్ రెండు వేర్వేరు ప్రొడక్ట్స్. కాబట్టి మీరు రెగ్యులర్‌గా వాడే కాఫీ బ్రాండ్ ధర చూసుకుని కొనడం మంచిది.

46
4. బెడ్‌షీట్లు, టవల్స్... ఇక్కడే ఎక్కువ ఆదా చేయొచ్చు!

డీమార్ట్‌కి వెళ్లినప్పుడు కిరాణా సరుకులతో పాటు హోమ్ టెక్స్‌టైల్స్ సెక్షన్ కూడా ఒకసారి చూడండి. బెడ్‌షీట్ల ధరల్లో చాలా తేడా కనిపిస్తుంది.

సింగిల్ బెడ్‌షీట్

ఎమ్మార్పీ: ₹599

డీమార్ట్ ధర: ₹229

ఆదా: ₹370

డబుల్ బెడ్‌షీట్

ఎమ్మార్పీ: ₹2,399

డీమార్ట్ ధర: ₹849

ఆదా: ₹1,550

టవల్స్ మీద కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయి. ఉదాహరణకు ఒక అథోమ్ లివింగ్ బాత్ టవల్ ఎమ్మార్పీ ₹299 కాగా, డీమార్ట్‌లో ₹99కే అమ్ముతున్నారు.

ఎమ్మార్పీ: ₹299

డీమార్ట్ ధర: ₹99

ఆదా: ₹200

అయితే బెడ్‌షీట్లు, టవల్స్ కొనేటప్పుడు కేవలం ధర మాత్రమే కాదు.. క్లాత్ క్వాలిటీ, సైజు, మందం, కాటన్ శాతం లాంటివి కూడా చెక్ చేసుకోవాలి.

56
5. కిచెన్ కంటైనర్లతోనూ డబ్బు ఆదా!

వంటగదిలో బియ్యం, పప్పులు, చక్కెర, పిండి, మసాలాలు దాచుకోవడానికి డబ్బాలు ఎప్పుడూ అవసరమే. డీమార్ట్‌లో కొన్ని కంటైనర్ సెట్స్ ఎమ్మార్పీకి, అమ్మే ధరకు మధ్య చాలా తేడా ఉంటుంది.

జాయో మల్టీపర్పస్ కంటైనర్ సెట్ – 3 డబ్బాలు

ఎమ్మార్పీ: ₹403

డీమార్ట్ ధర: ₹209

ఆదా: ₹194

అలాగే స్టీలో సాలిటైర్ 18 డబ్బాల సెట్ ఎమ్మార్పీ ₹1,701 కాగా, డీమార్ట్‌లో ₹549కే అమ్ముతున్నారు.

ఎమ్మార్పీ: ₹1,701

డీమార్ట్ ధర: ₹549

ఆదా: ₹1,152

ఇలాంటి పెద్ద సెట్స్ కొనేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. నిజంగా ఇన్ని డబ్బాలు మీ ఇంటికి అవసరమా? అవసరం ఉంటే పెద్ద సెట్ కొనడం వల్ల మంచి లాభం ఉంటుంది. లేదంటే వాడకుండా పక్కన పడేసే వస్తువుల కోసం డబ్బులు వృథా చేసినట్లు అవుతుంది.

66
6. డీమార్ట్‌లో కొనేటప్పుడు ఈ విషయాలు కూడా గమనించండి!

డీమార్ట్‌లో అన్ని వస్తువులు బయటి షాపుల కంటే తక్కువకే దొరుకుతాయని కచ్చితంగా చెప్పలేం. ధరలు, ఆఫర్లు అనేవి స్టోర్, నగరం, పిన్‌కోడ్, స్టాక్, పండుగ సీజన్‌ను బట్టి మారుతుంటాయి. అందుకే ఏదైనా వస్తువు కొనేముందు ఈ 4 విషయాలు గమనించండి

1. ఎమ్మార్పీ: వస్తువు అసలు ధర ఎంత?

2. అమ్మకపు ధర: ప్రస్తుతం ఎంతకు అమ్ముతున్నారు?

3. పరిమాణం: కిలో ధరా లేక మొత్తం ప్యాకెట్ ధరా?

4. అవసరం: నిజంగా ఆ వస్తువు ఇంటికి అవసరమా?

ముఖ్యంగా పెద్ద ప్యాకెట్లు చూడగానే "₹200 ఆదా", "₹500 ఆదా" అని గుడ్డిగా కొనకుండా.. కిలో లేదా లీటర్‌కు ఎంత పడుతుందో లెక్కేసుకోండి. డీమార్ట్‌లో స్మార్ట్‌గా షాపింగ్ చేయడమంటే అన్నీ చౌకగా కొనడం కాదు; రెగ్యులర్‌గా వాడే వస్తువులను సరైన ధరకు కొని, అనవసర ఖర్చులను తగ్గించుకోవడం.

గమనిక: పైన చెప్పిన ధరలు డీమార్ట్ రెడీ యాప్‌లో ఉన్న వివరాల ఆధారంగా ఇచ్చిన ఉదాహరణలు మాత్రమే. స్టోర్, ప్రాంతం, సమయాన్ని బట్టి ఈ ధరలు మారొచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories