Viral News: రూ. 30 కోట్ల జీతం.. మీకు మీరే బాస్‌, కేవ‌లం స్విఛ్ ఆన్, ఆఫ్ చేయ‌డ‌మే ప‌ని. ఇంత‌కీ ఏంటా ఉద్యోగ‌మంటే

Published : Jul 27, 2025, 08:10 AM IST

ఎలాంటి ఒత్తిడి లేకుండా ఎలాంటి డెడ్ లైన్స్ లేకుండా మంచి జీతం వ‌చ్చే ఉద్యోగం పొందాల‌ని చాలా మంది ఆశ‌ప‌డుతుంటారు. అయితే అలాంటి ఉద్యోగాలు చాలా క‌ష్ట‌మ‌ని తెలిసిందే. అయితే అలాంటి ఓ ఉద్యోగానికి సంబంధించిన వార్త ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. 

PREV
15
కోట్ల రూపాయల సంపాద‌న

బాస్ ఒత్తిడి లేకుండా, ఆఫీస్ టెన్షన్ లేకుండా కోట్ల రూపాయలు సంపాదించే ఉద్యోగం ఉంటే ఎలా ఉంటుందో ఊహించండి. ఒక స్విచ్ ఆన్ చేయడం, ఆఫ్ చేయడం మాత్రమే చేసే పని ఉంటే? వినడానికి చాలా ఆకర్షణీయంగా ఉంది కదా! సోషల్ మీడియాలో ఇటువంటి ఉద్యోగం ఉందని వైరల్ అవుతున్న పోస్టులు చాలామందిని ఆశ్చర్యపరుస్తున్నాయి. కానీ ఈ వార్తల్లో నిజమెంత? ఇప్పుడు తెలుసుకుందాం.

DID YOU KNOW ?
నిజంగానే అంత జీతాలుంటాయా.?
లైట్ హౌజ్‌కీప‌ర్‌కు ఏటా రూ. 30 కోట్ల జీతం అన్న‌దాంట్లో నిజం లేద‌ని తెలుస్తోంది. సాధార‌ణంగా ఈ ఉద్యోగానికి సుమారు రూ. 30 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉండొచ్చ‌ని అంచ‌నా. అందులోనూ ప్ర‌స్తుతం ఈ వ్య‌వ‌స్థ‌ అంతా ఆటోమేష‌న్‌గా మారుతోంది.
25
డ్రీమ్ జాబ్.?

నెట్టింట వైర‌ల్ అవుతోన్న ఓ పోస్ట్ ప్ర‌కారం.. ఈజిప్టులోని అలెగ్జాండ్రియా పోర్టులో ఫారోస్ దీవిపై ఉన్న చారిత్రక లైట్‌హౌస్‌లో కీపర్‌గా పనిచేస్తే సంవత్సరానికి రూ.30 కోట్లు (సుమారు £2.8 మిలియన్) జీతం వస్తుందని చెబుతోంది. ఇంత‌కీ ఈ జాబ్ రోల్ ఏంటంటే చాలా సింపుల్ లైట్‌హౌస్ బాధ్య‌త‌లు చూసుకోవ‌డ‌మే. స‌ద‌రు లైట్ హౌజ్ స‌రిగ్గా వెలుగుతుందా లేదా చూసుకోవాలి. అవ‌స‌రం పూర్తికాగానే లైట్ ఆఫ్ చేయాలి అంతే.

35
ఎన్ని లాభాలో..

నెట్టింట ట్రెండ్ అవుతోన్న పోస్ట్ ప్ర‌కారం. ఈ ఉద్యోగం చేసే వ్య‌క్తి ఎప్పుడైనా నిద్ర‌పోవ‌చ్చు. ఎవరూ ఇబ్బంది పెట్ట‌రు. మీ బాస్ ఎవ‌రూ ఉండ‌రు. పూర్తిగా ప్రకృతితో గడిపే అవకాశం ఉంటుంది. చుట్టు స‌ముద్రాన్ని చూస్తు ఎంచ‌క్కా ఎంజాయ్ చేయొచ్చు.

45
అర్హ‌త ఏంటి.?

ఈ కథనాల ప్రకారం, లైట్‌హౌస్ కీపర్ కావాలంటే 10వ తరగతి వరకు చదివి ఉంటే సరిపోతుందని చెబుతున్నారు. అయితే, కొంత సాంకేతిక పరిజ్ఞానం అవసరమని కూడా అంటున్నారు. షిప్‌లకు మార్గదర్శకంగా ఉండే ఈ లైట్‌హౌస్ చారిత్రక ప్రాధాన్యం కలిగినదని సోషల్ మీడియాలో చెబుతున్నారు.

55
ఇంత‌కీ ఉద్యోగం నిజ‌మేనా.?

నెట్టింట వైర‌ల్ అవుతోన్న ఈ వార్త‌లో 100 శాతం నిజం ఉందా అంటే క‌చ్చితంగా అవున‌ని చెప్ప‌లేని ప‌రిస్థితి. ఎందుకంటే ‘జుమోన్ లైట్‌హౌస్’ అనే పేరుతో ఫ్రాన్స్‌లో లైట్‌హౌస్ ఏదీ లేదు. అంతేకాకుండా, ఈజిప్టు లైట్‌హౌస్ కూడా ప్రస్తుతం పూర్తిగా ఆటోమేటెడ్‌ అయ్యింది. కాబట్టి కీపర్ అవసరం ఉండదు.

అంతే కాకుండా రూ.30 కోట్ల జీతం అనేది కూడా పూర్తిగా స‌త్య‌దూర‌మ‌ని చెప్పాలి. వాస్తవానికి లైట్‌హౌస్ కీపర్‌లకు ప్రభుత్వ సముద్ర విభాగాలు లేదా మారిటైమ్ ఏజెన్సీలు ఇచ్చే జీతం సుమారు $40,000–$60,000 (దాదాపు ₹31 లక్షల నుంచి ₹47 లక్షల వరకు) మాత్రమే ఉంటుంది. కాబ‌ట్టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్న వార్త‌ల్లో వాస్త‌వం లేద‌ని గుర్తించాలి.

Read more Photos on
click me!

Recommended Stories