మహిళా వర్క్ ఫ్రమ్ హోమ్ పథకం.. ఇంట్లో ఉంటూనే నెలకు రూ.25,000 సంపాదించవచ్చా..?

Published : Feb 21, 2026, 11:43 AM IST

PIB Fact Check : మహిళలు ఇంట్లో ఉంటూనే నెలనెలా రూ.25,000 సంపాదించేలా ‘మహిళ వర్క్ ఫ్రమ్ హోమ్ యోజన 2026’, నిరుద్యోగులకు ఆర్థిక సాయం అందించే 'బేరోజ్గారీ భత్తా యోజన 2026' వంటి పథకాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందాా..? 

PREV
16
అసలు ఈ పథకాలు ఉన్నాయా..?

PIB Fact Check : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలు, నిరుద్యోగ యువత కోసం అనేక పథకాలు అమలుచేస్తున్నాయి. వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి... కొన్ని పథకాల ద్వారా నేరుగా ఆర్థికసాయం కూడా చేస్తున్నాయి. అయితే తాజాగా మహిళలు ఇంటివద్దే ఉంటే ఆదాయాన్ని పొందేలా ఓ వర్క్ ఫ్రమ్ హోం స్కీంను, నిరుద్యోగులకు ఆర్థిక సాయం అందించేందుకు మరో పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తోందని జోరుగా ప్రచారం జరుగుతోంది.

అసలు ఈ పథకాలు నిజంగా ఉన్నాయా..? కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తోందా..? అనే కన్ష్యూజన్ ప్రజల్లో క్రియేట్ అయ్యింది. ఈ అనుమానాలను నివృత్తి చేసేందుకు PIB (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) Fack Check చేసింది. ఈ క్రమంలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.

26
మహిళా వర్క్ ఫ్రమ్ హోమ్ యోజన 2026 నిజమేనా..?

కేంద్ర ప్రభుత్వం 'మహిళా వర్క్ ఫ్రమ్ హోమ్ యోజన 2026' పేరుతో ఓ పథకం ప్రారంభించిందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. మహిళలకు ఇంటి నుంచి పనిచేసే అవకాశం కల్పిస్తూ నెలకు రూ.25,000 జీతం ఇస్తోందని ఓ వీడియో వైరల్ అవుతోంది. కొన్ని సోషల్ మీడియా ఛానెల్స్ మరో అండుగు ముందుకువేసి ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేసుకోవాలని కూడా సూచిస్తున్నాయి. అయితే ఈ ప్రచారాన్ని ప్రభుత్వ ఫ్యాక్ట్-చెక్ విభాగం పూర్తిగా ఫేక్ అని తేల్చేసింది. అలాంటి పథకం ఏదీ లేదని స్పష్టం చేసింది.

36
ఈ యూట్యూబ్ ఛానెల్లోనే ఫేక్ వీడియో

పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ప్రకారం... మహిళా వర్క్ ఫ్రమ్ హోమ్ యోజన్ 2026 పేరిట తప్పుడు ప్రచారం జరగడానికి కారణం 'Buddhsen92TechOfficial' అనే యూట్యూబ్ ఛానెల్. ప్రభుత్వ పథకం పేరుతో మహిళలు ప్రతి నెలా స్థిరమైన ఆదాయం పొందవచ్చనే అబద్ధాన్ని ఈ ఛానెల్ వీడియో ప్రచారం చేస్తోంది. ఈ వీడియో, అందులోని వాదనలు పూర్తిగా అవాస్తవమని, ప్రభుత్వానికి దీనితో ఎలాంటి సంబంధం లేదని అధికారులు ధృవీకరించారు.

46
నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం నిజమేనా..?

కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఆర్థికసాయం చేస్తోందనే మరో తప్పుడు ప్రచారం కూడా సోషల్ మీడియాలో జరుగుతోంది. 'బేరోజ్గారీ భత్తా యోజన 2026'' కింద నెలనెలా రూ.2500 నిరుద్యోగ భృతిగా కేంద్రం అందిస్తోందని.. అర్హులైనవారు దరఖాస్తు చేసుకోవాలనే ప్రచారం జరుగుతోంది. ఇది కూడా 'Buddhsen92TechOfficial' యూట్యూబ్ ఛానల్ నిర్వాకమేనని PIB Fact Check గుర్తించింది. ఇలాంటి పథకమేమీ లేదని స్పష్టం చేసింది.

56
అనుమానాస్పద వార్తలను ఎలా వెరిఫై చేయాలి?

సోషల్ మీడియాలో కనిపించే ఆకర్షణీయమైన ఉద్యోగ ఆఫర్లు, ఆదాయ హామీలను గుడ్డిగా నమ్మవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. మోసగాళ్లు తరచుగా ప్రభుత్వ పేర్లు, లోగోలు, పథకాలను వాడుకుని ప్రజల నమ్మకాన్ని పొంది తప్పుదోవ పట్టిస్తుంటారు. కాబట్టి ప్రభుత్వ పథకాలు లేదా ప్రయోజనాలకు సంబంధించిన సమాచారం కోసం అధికారిక ప్రకటనలు, ధృవీకరించిన వెబ్‌సైట్లపై మాత్రమే ఆధారపడాలని సూచిస్తున్నారు

ప్రభుత్వ పథకాలకు సంబంధించి అనుమానాస్పద వార్తలు, వీడియోలు లేదా ఫొటోలు కనిపిస్తే వాటిని నేరుగా పీఐబీ ఫ్యాక్ట్ చెక్‌కు పంపవచ్చు. వాట్సాప్ నంబర్ +91 8799711259 ద్వారా లేదా factcheck@pib.gov.in కు ఈ-మెయిల్ పంపి వెరిఫై చేసుకోవచ్చు. ఆన్‌లైన్ మోసాలు, తప్పుడు సమాచారాన్ని నివారించడానికి ప్రజల అవగాహన, సమాచారాన్ని జాగ్రత్తగా సరిచూసుకోవడం చాలా అవసరం అని అధికారులు నొక్కిచెబుతున్నారు.

66
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఈ ఫేక్ వర్క్ ఫ్రమ్ హోమ్, నిరుద్యోగ భృతి పథకాలు తప్పుడు సమాచారం ఆన్‌లైన్‌లో ఎంత వేగంగా వ్యాపిస్తుందో మరోసారి స్పష్టం చేశాయి. ఇలాంటి కంటెంట్‌ను నమ్మే ముందు లేదా షేర్ చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించాలని… విశ్వసనీయ వర్గాల నుంచి వాస్తవాలను ధృవీకరించుకోవాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories