YS Jagan: మాజీ సీఎం వైఎస్ జగన్, హీరో సుమంత్ క్లాస్ మేట్స్. ఈ క్రమంలో జగన్ చిన్నప్పుడు ఎలా ఉండేవారో వెల్లడించాడు సుమంత్. ఆయన రియాలిటీ బయటపెట్టాడు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడిగా రాజకీయాల్లోకి వచ్చి, తండ్రి మరణం అనంతరం వైఎస్‌ఆర్‌సీపీని స్థాపించి ఇప్పుడు తనే ఒక శక్తిగా, వ్యవస్థగా ఎదిగారు. గత టర్న్ ఏపీకి సీఎం అయ్యారు. ఐదేళ్లు సంచలనాలకు కేరాఫ్‌గా నిలిచారు. గత ఎన్నికల్లో ఆయన పార్టీ ఓటమి పాలయ్యింది. కేవలం 11 సీట్లని మాత్రమే గెలుచుకుంది. కానీ తన ఓట్ బ్యాంక్ మాత్రం సాలిడ్‌గా ఉందని చెప్పొచ్చు. ఏపీలో అన్ని పార్టీలు సింగిల్‌గా పోటీ చేస్తే జగన్ సీఎం అవుతారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
24
జగన్ రియాలిటీ చెప్పిన సుమంత్
రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు మాజీ సీఎం జగన్. ఇప్పుడు ప్రతిపక్ష నేతగా రాణిస్తున్నారు. అయితే ఆయన, హీరో సుమంత్ క్లాస్ మేట్స్. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో కలిసి చదువుకున్నారు. ఆ సమయంలో వైఎస్ జగన్ ఎలా ఉండేవారు? ఆయన రియాలిటీ ఏంటనేది వెల్లడించారు హీరో సుమంత్. తాజాగా ఆయన `న్యూటన్స్ థర్డ్ లా` అనే మూవీలో నటించారు. ఈ నెల 31న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా సుమంత్ రియాక్ట్ అయ్యారు. తన ఫ్రెండ్స్ గురించి చెబుతూ, తన స్నేహితుల్లో బాగా సెట్ అయినవాళ్లు, మంచి స్థాయికి వెళ్లిన వారిలో ఎవరున్నారనే ప్రశ్న ఎదురుకాగా, జగన్ గురించి చెప్పారు.
34
రాజకీయాల్లోకి వస్తారని ముందే తెలుసు
రాజకీయంగా మంచి స్థాయికి ఎదిగిన వారిలో జగన్ ఒక్కరే అని, సినిమాల్లో తాను ఒక్కడినే అని తెలిపారు. మిగిలిన వాళ్లు ఎవరూ పెద్ద స్థాయికి రాలేదన్నారు. ఈ సందర్భంగా జగన్ గురించి చెబుతూ, చిన్నప్పుడే ఆయనలో లీడర్ లక్షణాలు ఉండేవని, టీమ్‌ని లీడ్ చేసేవాడని చెప్పారు సుమంత్. పెద్దయ్యాక పొలిటీషియన్ అవుతాడని, అప్పుడే అనుకున్నాం. లీడర్ షిప్ క్వాలిటీస్ అప్పుడే ఉండేవి, హౌజ్ కెప్టెన్‌గా వ్యవహరించేవారు అని చెప్పాడు సుమంత్. తను కచ్చితంగా పొలిటిక్స్ లోకి వెళ్తాడని మేమంతా అనుకున్నాం, నేను సినిమాల్లోకి వెళ్తానని అందరు అనుకున్నారు అని చెప్పారు.
ఇప్పుడు జగన్‌ని పెద్దగా కలవలేదని, కానీ ఆ సమయంలో రెగ్యూలర్‌గా కలిసేవాళ్లమని, తాము మంచి స్నేహితులమని, క్లోజ్‌గా ఉండేవాళ్లమని, కలిసి తిరగడం, రెస్టారెంట్‌లకు వెళ్లేవాళ్లమని చెప్పాడు సుమంత్. జగన్ తన కంటే రెండేళ్లు పెద్ద అని చెప్పాడు. రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన తనకు లేదని, దానికి తాను సెట్ కానని వెల్లడించాడు సుమంత్. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.