Youtuber Nandu: యూట్యూబర్ నందు నెల సంపాదన ఎంతో తెలుసా? నందూస్ వరల్డ్ క్లోజ్ అవ్వబోతోందా?

Published : Jun 09, 2026, 03:45 PM IST

నందూస్ వరల్డ్ యూబ్యూబ్ ఛానెల్ తో బాగా పేమస్ అయిన నందన, ఆమె భర్త ప్రస్తుతం వీసా కేసులో నిండగా మునిగి ఉన్నారు. ఎంతో మంది సోషల్ మీడియా అభిమానులను సంపాదించుకున్న నందు.. యూట్యూబ్ ద్వారా ఎంత సంపాదిస్తుందో తెలుసా? 

PREV
16
వీసా స్కామ్ లో యూట్యూబర్ నందు ఫ్యామిలీ..

ప్రస్తుతం ఎక్కడ విన్నా.. యూట్యూబర్ నందు గురించే టాపిక్. ఆమె చేసిన వీడియోలకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇప్పుడు ఆ అభిమానులే ఆమెను, ఆమె భర్తను ఘాటుగా విమర్శిస్తున్నారు. వీసా రెన్యువల్ కేసులో నిండా మునిగిపోయి ఉంది నందు ఫ్యామిలీ. యూకేలో కూడా కేసులు నమోదై ఉండటంతో.. వారు తప్పించుకునే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ దంపతులు నేరం చేసినట్టు రుజువైతే.. దాదాపు 10 ఏళ్లు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉన్నట్టు సమాచారం. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఇమేజ్ సాధించిన నందూస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా నందు ఎంత సంపాదిస్తుంది. గతంలో తన సంపాదన గురించి నందు ఏం చెప్పింది.?

26
తక్కువ టైమ్ లో స్టార్ గా మారిన రామ నందన

నందూస్ వరల్డ్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయ్యింది నందు అలియాస్ రామ నందన. కోవిడ్ టైమ్ లో సరదాగా టైమ్ పాస్ కోసం యూట్యూబ్ ఛానెల్ ను స్టార్ట్ చేసి.. చిన్న చిన్న వీడియోలు పెట్టింది. ఆ వీడియోలకు మంచి వ్యూస్ రావడంతో పాటు సబ్ స్క్రైబర్లు కూడా పెరగడంతో.. వీడియోల సంఖ్య పెంచింది. అయితే తన వాయిస్ కాస్త డిఫరెంట్ గా ఉండటంతో, కామెడీగా ఉందంటూ ఆమెను కామెంట్లలో ఎగతాళి చేశారు నెటిజన్లు. దాంతో నందు పట్టుదలతో తన వాయిస్ ను ప్లస్ గా మార్చుకుని కామెడీ వీడియోలు చేయడం స్టార్ట్ చేసింది. చాలా తక్కువ టైమ్ లోనే ఆమె సోషల్ మీడియా స్టార్ గా మారింది.

36
నందూస్ వరల్డ్ కు భారీగా సబ్‌స్క్రైబర్లు

యూట్యూబ్ లో నందూస్ వరల్డ్ ఛానెల్ కు 20 లక్షల 88 వేల(2.88 M) సబ్ స్క్రైబర్లు ఉన్నారు. ఆమె వీడియో పెడితే వెంటనే వైరల్ అయ్యి.. లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి. అయితే యూట్యూబ్ ఛానెల్ ద్వారా తాము సంపాదించేది పెద్దగా ఏం లేదని.. మంచి పేరు, ఇమేజ్ మాత్రమే వచ్చాయని, తమ వ్యాపారాలు, ఉద్యోగాల ద్వారా వచ్చే సంపాదనే తమకు ఎక్కువని నందు ఓ సందర్భంలో చెప్పింది. నందు మాట్లాడుతూ.. ''చాలామంది కామెంట్ చేస్తుంటారు. మేము యూట్యూబ్ ద్వారా కోట్లల్లో సంపాదించి.. ఇండియాకు బిజినెస్ క్లాస్ ప్లైట్ లో తిరుగుతున్నామని. కానీ గతంలో కూడా మేం బిజినెస్ క్లాస్ లోనే తిరిగాం. యూట్యూబ్ సంపాదన మా ఫ్లైట్ టికెట్లకు కూడా సరిపోదు'' అని సంచలన కామెంట్స్ చేసింది నందన.

46
యూట్యూబ్ ద్వారా ఎంత సంపాదిస్తుందంటే?

రామ నందన ఆమె భర్త యూట్యూబ్ ఛానెల్ ద్వారా నెలకు దాదాపు 20 నుంచి 30 లక్షల వరకూ సంపాదిస్తారని సమాచారం మాత్రమే. కానీ ఎక్కడా నందూ మాకు ఇంత వస్తుందని చెప్పింది లేదు. ఆమెకు ఇండియాలో కూడా ఆస్తు ఉన్నట్టు సమాచారం. నందు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. '' యూట్యూబ్ ద్వారా కోట్లు సంపాదిస్తున్నామని చాలామంది అంటుంటారు కానీ అలా చేయాలంటే మేం ప్రమోషన్లు తీసుకోవాలి. అలా సంపాదించే వారి వెనుక ఓ డార్క్ నెట్ వర్క్ ఉంటుంది. కానీ మేం అలా చేయలేము... మాకు వ్యూస్ ద్వారా యూట్యూబ్ వాడు ఇచ్చే కొంచెం చాలు. '' అని ఇండైరెక్ట్ గా తన యూట్యూబ్ సంపాదన చాలా తక్కువ అని చెప్పింది.

56
సినిమాల్లో నటించిన రామ నందన

నందు చేసే రీల్స్ కు కూడా భారీగా స్పందన వస్తుంటుంది. అంతే కాదు నందు సంపాదనపై రకరకాల కామెంట్లు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. ఆమె గతంలో ఈ విషయంపై మాట్లాడింది కూడా. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. యూకే వచ్చిన తరువాత జాబ్ పోవడంతో.. చాలా ఇబ్బందులు పడ్డారు. పార్ట్ టైమ్ జాబులు చేసుకుని.. మళ్లీ ఓ స్థాయికి వచ్చారు. యూట్యూబ్ ఛానెల్ ద్వారా చాలా పాపులరిటీని వారు సాధించారు. ఆ ఇమేజ్ తో రీసెంట్ గా చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాదు సినిమాలో నటించే అవకాశం కూడా రామ నందనకి వచ్చింది. ఇక నందు అండ్ ఫ్యామిలీకి యూకేలో సొంత ఇల్లు ఉంది. నందు ఆమె భర్త మధుకు యూకేలో సొంత వ్యాపారాలు కూడా ఉన్నాయి.

66
నందూస్ వరల్డ్ క్లోజ్ అవుతుందా?

తాజాగా వారు వీసా స్కామ్ లో ఇరుక్కోవడంతో.. అది రుజువైతే.. 10 ఏళ్లు జైలు తో పాటు, వారి వీసా,పాస్పోర్ట్ కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అంతే కాదు నందు యూట్యూబ్ ఛానల్ కూడా క్యాన్సిల్ అవుతుందని అంటున్నారు. యూకే నుంచి బహిష్కరిస్తారన్న వార్తలు కూడా వస్తున్నాయి. ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి. కొంత మంది నందు అభిమానులు ఆమెకు సపోర్ట్ గా కామెంట్లు పెడుతుంటే.. ఎక్కవ మంది ఆమె ఫాలోవర్స్ మాత్రం నిప్పులేకుండా పొగరాదు, వారిది తప్పేనని విమర్శిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories