Vijay Sangeetha Reunion: త్రిషకి సీఎం దళపతి బిగ్‌ షాక్‌.. మళ్లీ ఒక్కటైన విజయ్-సంగీత?

Published : Jun 09, 2026, 02:53 PM IST

Vijay Sangeetha Reunion: తమిళనాడు సీఎం, టీవీకే  అధినేత విజయ్, ఆయన భార్య సంగీత మళ్లీ కలిసిపోయారనే వార్తలు కోలీవుడ్‌లో గుప్పుమంటున్నాయి. కుటుంబ సభ్యుల చొరవతోనే వీరిద్దరూ ఒక్కటయ్యారని తెలుస్తోంది. ఇదిప్పుడు సంచలనంగా మారింది. 

PREV
16
సంచలనాలకు కేరాఫ్‌గా సీఎం విజయ్‌

హీరో దళపతి విజయ్‌.. తమిళనాడు రాజకీయాల్లో ఒక ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. టీవీకే పార్టీని స్థాపించి ఆయన ఇటీవల ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఇప్పుడు ఏకంగా సీఎం అయ్యారు. అందరిని ఆశ్చర్యపరుస్తూ, రెండు బలమైన పార్టీలను మట్టికరిపిస్తూ ఆయన విజయం సాధించారు. ప్రస్తుతం తమిళనాడుకి సీఎంగా ఉన్నారు. అక్కడ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. సంచలనాలకు కేరాఫ్‌గా నిలుస్తున్నారు. 

26
మళ్లీ కలవబోతున్న విజయ్‌, సంగీత?

ఇదిలా ఉంటూ ఎన్నికలకు ముందూ విజయ్‌ ఫ్యామిలీ పరంగా ఇబ్బందులు ఫేస్‌ చేశాడు. ఆయన భార్య సంగీత విడాకులు కోరుతూ కోర్ట్ కి ఎక్కింది. మరో నటితో ఆయన సన్నిహిత్యంగా ఉండటమే దానికి కారణమని ఆమె వెల్లడించింది. దీంతో వీరిద్దరు విడిపోవడం పక్కా అనే ఊహాగానాలు వినిపించాయి. అయితే విజయ్‌ సీఎం అయ్యాక అన్నీ మారిపోతున్నాయి. చాలా విషయాలు రివర్స్ అవుతున్నాయి. అలానే ఇప్పుడు తన ఫ్యామిలీ మ్యాటర్‌ కూడా రివర్స్ గా మారిపోతుంది.  ఈ  క్రమంలో ఈ జంట మళ్లీ ఒక్కటైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తతో తమిళగ వెట్రి కళగం (TVK) కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.

36
విజయ్‌ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో రూమర్లు
విజయ్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో, భార్య సంగీతతో విభేదాలు వచ్చాయని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. లండన్‌లో ఉంటున్న సంగీత, విజయ్ రాజకీయ సభలకు రాకపోవడంతో ఈ వదంతులకు మరింత బలం చేకూరింది. దీంతో అభిమానులు ఆందోళన చెందారు.
46
విజయ్‌ అమ్మ చొరవతో మళ్లీ రీయూనియన్‌
ఈ సమస్యకు ముగింపు పలకాలని విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్, ఇతర కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్థలను, ఇగోలను పక్కనపెట్టేలా మాట్లాడారు. ప్రస్తుతం సంగీత చెన్నైకి తిరిగి వచ్చారని, నీలంకరైలోని ఇంట్లో ఇద్దరూ కలిసి ఉంటున్నారని సమాచారం.
56
సంబరాల్లో విజయ్‌ అభిమానులు

విజయ్, సంగీత కలిసిపోయారన్న వార్త తెలియగానే తమిళగ వెట్రి కళగం కార్యకర్తలు, అభిమానులు పండగ చేసుకుంటున్నారు. 'మా తలైవా కుటుంబం ఒక్కటైంది' అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ, టపాసులు కాలుస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. ఇది తమ నాయకుడికి రాజకీయంగా కూడా బలమని వారు భావిస్తున్నారు. 'అన్ని సమస్యలు తీరిపోయాయి' అనే ఈ సానుకూల వార్త, తమిళగ వెట్రి కళగం పార్టీ భవిష్యత్ రాజకీయాలకు ఎంతో బలాన్నిస్తుందని భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల చొరవతో విజయ్, సంగీత మళ్లీ ఒక్కటయ్యారన్న వార్త.. టీవీకే కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

66
త్రిషకి విజయ్‌ బిగ్‌ షాక్‌

విజయ్‌, సంగీత మళ్లీ కలుస్తున్నారు, విడిపోవడం లేదనే వార్తలు ఇప్పుడు మరో ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. విజయ్‌, త్రిష ప్రేమించుకుంటున్నారనే వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. సంగీతతో విజయ్‌ విడిపోతే, ఆ తర్వాత త్రిషని పెళ్లి చేసుకుంటారనే ప్రచారం జరిగింది. త్రిష కూడా విజయ్‌పై ప్రేమని పలు రకాలుగా వ్యక్తం చేస్తూ వచ్చింది. విజయ్‌ సీఎం ప్రమాణ స్వీకారం రోజు ఆమె స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. అదే సమయంలో ఎన్నికల్లో గెలిచిన వెంటనే విజయ్‌ని కలిసింది త్రిష. అంతేకాదు విజయ్‌ కోసం ఆమె రాజకీయాల్లోకి కూడా రాబోతుందని అంటున్నారు. ఇలాంటి తరుణంలో విజయ్‌, సంగీత కలిస్తే, త్రిష పరిస్థితేంటి? అనేది ప్రశ్న. త్రిషతో తన రిలేషన్‌ని విజయ్‌ ఎలా కొనసాగిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఏం జరుగుతుందో చూడాలి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories