వరుసగా ప్రేమ కథలతో...హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు సుమంత్ అశ్వీన్.. లవర్స్, కేరింత లాంటి సినిమాలతో ప్రామిసింగ్ యాక్టర్‌గా క్రేజ్ తెచ్చుకున్నాడు. కాని ఆతరువాత సుమంత్ కు పెద్దగా హిట్ సినిమాలు పడింది లేదు. సుమంత్ చేసిన కొన్ని సినిమాలయితే.. అసలు ఎప్పుడు థియేటర్లలోకి వచ్చాయో కూడా తెలియదు.. ఎప్పుడు వెళ్ళాయో కూడా తెలియదు.