ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి దిల్ రాజు తప్పుకోబోతున్నాడా..? స్టార్ ప్రొడ్యుసర్ నెక్ట్స్ స్టెప్ ఏంటి..?

First Published | Aug 13, 2024, 8:36 PM IST

టాలీవుడ్ లో టాప్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నాడు దిల్ రాజు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన దిల్ రాజు.. ఇండస్ట్రీ నుంచి తప్పుకుంటున్నారా..? వైరల్ న్యూస్ లో నిజం ఎంత..? 

చిన్న వ్యాపారం చేస్తూ.. స్టార్ ప్రొడ్యూసర్ స్థాయికి ఎదిగాడు దిల్ రాజు.  ఫిల్మ్ ఇండసట్రీలో డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి.. ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ అయ్యాడు దిల్ రాజు. నితిన్ హీరోగా.. దిల్ సినిమాతో నిర్మాతగా తన కెరీర్ ను స్టార్ట్ చేశాడు రాజు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో.. ఇండస్ట్రీలో దిల్ రాజుగా పేరు తెచ్చుకున్నాడు. 

ప్రభాస్ కు చుక్కలు చూపించిన స్టార్ హీరోయిన్ ఎవరు..? ఏం చేసింది.

తెలుగులో దిల్ తరువాత ఆర్య, బద్ర, బొమ్మరిల్లు, కొత్త బంగారులోకం,  సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి సినిమాలెన్నో ఆయన నిర్మించారు. హీరోలలో స్టార్ హీరోలు ఎలానో.. నిర్మాతల్లో స్టార్ ప్రొడ్యూసర్ గా దిల్ రాజు టాలీవుడ్ ను ఏలుతున్నారు. 

హీరోయిన్ తో మహేష్ బాబు లిప్ లాక్... నమ్రత ఏం చేసిందో తెలుసా..?


టాలీవుడ్ లో దిల్ రాజు నిర్మించిన ప్రతీ సినిమా.. సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో పాటు.. దిల్ రాజుకు కోట్లలో లాభాలు కూడా తెచ్చిపెట్టాయి. దాంతో ఇండస్ట్రీలో చాలా తక్కువ కాలంలో భారీ స్థాయిలో ఎదిగారు దిల్ రాజు. ఇండస్ట్రీలో ఆయనకు తెలియకుండా ఏం జరగదంటే.. దిల్ రాజు ఎంత ఎదిగారోఅర్ధం అవుతుంది. అంతే కాదు ఎక్కువ థియేటర్లు, డిస్ట్రీబ్యూషన్ కూడా దిల్ రాజు చేతిలోనే ఉంటాయని టాక్.

అనుష్కను వేశ్య పాత్ర చేయవద్దు అని వార్నింగ్ ఇచ్చిన స్టార్ హీరో ఎవరు..?

ఇంక ఇంతలా ఎదిగిన దిల్ రాజు. ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి తప్పుకోబోతున్నారని టాక్ సోషల్ మీడియాలో గట్టిగా నడుస్తోంది. ఇంతకీ ఆయన ఎందుకు ఇలా అనుకుంటున్నారు. ఈ వార్తల్లో నిజం ఎంత అనేతి తెలియదు. కాని ఈమధ్య ఆయన నిర్మించిన చాలా సినిమాలు ప్లాప్ అవ్వడంతో చాలా నష్టం వచ్చిందట. దాంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారనటి టాక్. అయితే ప్రస్తుతం దిల్ రాజు రెండు సినిమాలు ప్రస్తుతం సెట్స్ మీద ఉన్నాయి. 
 

రామ్ చరణ్, శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ తో పాటు.. నాని హీరోగా సరిపోదా శనివారం సినిమాని కూడా నిర్మిస్తున్నారు. ఈసినిమాలు హిట్ అయ్యి లాభాలు వస్తే.. దిల్ రాజు ఇండస్ట్రీలో కొనసాగుతారని.. లేదంటే.. ఆయన వేరే బిజినెస్ ల వైపు వెళ్ళే అవకాశం ఉందని టాక్ గట్టిగా నటుస్తోంది. ఇందులో నిజం ఎంతో తెలియదు కాని.. రూమర్లు మాత్రం నెట్టింట్లో గట్టిగా వినిపిస్తున్నాయి.  

Latest Videos

click me!