హన్సికా మోట్వాని షాకింగ్ కామెంట్స్.. పెళ్ళి వార్తలపై క్లారిటీ ఇచ్చిన ముంబాయ్ బ్యూటీ

Published : Jul 13, 2022, 09:47 AM IST

త్వరలోనే హాఫ్ సెంచరీ సినిమాల మార్క్ దాటబోతోంది హీరోయిన్ హస్సికా  మోట్వాని. మహా సినిమాతో  50 మార్క్ ను టచ్ చేయబోతోంది. ఈ సందర్భంగా మీడియాతో సరదాగా మాట్లాడారు హన్సిక. తన పెళ్ళితో పాటు ..ఇతర విషయాలపై కూడా క్లారిటీ ఇచ్చారు. 

PREV
18
హన్సికా మోట్వాని షాకింగ్ కామెంట్స్.. పెళ్ళి వార్తలపై క్లారిటీ ఇచ్చిన ముంబాయ్ బ్యూటీ
Hansika Motwani

తెలుగు, తమిళం భాషల్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ సాధించిన హీరోయిన్‌ హన్సికా.  గ్లామర్ క్యారెక్టర్స్ నుంచి లేడీ ఓరియెంటెడ్ పాత్రలవైపు మళ్లింది బ్యూటీ.  హన్సిక నటించిన ఫస్ట్ విమెన్ సెంట్రిక్ మూవీ  మహా. ఈ సినిమాతో హన్సికా.. 50 సినిమాల మార్క్ ను క్రాస్ చేయబోతోంది. 

28
Hansika Motwani bikini photo viral

ఎక్స్‌ట్రా ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై వి.మదియళగన్‌ నిర్మించిన మహా సినిమాను యుఆర్‌ జమీల్‌ దర్శకత్వం వహించారు. తమిళ క్రేజీ స్టార్ హీరో...  శింబు ఈ సినిమాలో  ప్రత్యేక పాత్రలో నటించారు. ఇక ఎంత వీలైతే అంత త్వరగా ఈ సినిమాను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్.. ఈ సందర్భంగా హీరోయిన్ హన్సిక చెన్నైలో మీడియాతో మాట్లాడారు. బోలెడు విశేషాలు పంచుకున్నారు.  
 

38

సినిమాలకు గ్యాప్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయంటోంది హన్సిక. అందులో కరోనా కూడా ఒక కారణమంటోంది. ఆ టైమ్ లోనే కెరీర్ కాస్త వెనకబడిన్టు అయ్యిందన్నారు. అంతే కాదు తాను ఎప్పుడూ ఖాళీగా ఉండనని. ఏదో ఒక పని చేస్తునే ఉంటాను అంటోంది. పని చేయడం తనకు శక్తిని, పట్టుదలను ఇస్తుందట. అదే తనకు బలం అంటోంది హన్సికా మోట్వానీ. 
 

48

పెళ్లెందుకు చేసుకోవాలంటూ రివర్స్ క్వశ్నన్ వేస్తోంది హన్సిక. 50 సినిమాలు చేశారు.. ఇక పెళ్ళి ఎప్పుడు అన్న ప్రశ్నకు.. ఈ  ముంబయి బ్యూటీ సమాధానం ఇస్తూ..  ప్రస్తుతం సినిమాలు చేసుకుంటూ.. పనిలో జీవితాన్ని వెతుక్కుంటున్నానంటోంది. ఇందులోనే తాను  సంతోషంగానే ఉన్నాను అంటోంది. . ఇప్పటికీ వర్క్‌తోనే నా పెళ్లి. టైం వచ్చినప్పుడు దాని గురించి ఆలోచిస్తాను అంటూ.. కరాఖండీగా చెప్పేసింది. 

58

మహా సినిమాను సెలక్ట్ చేసుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయంటోందో హన్సికా. ఈ సినిమా కథ చాలా ప్రత్యేకం, కథ తనను బాగా ఇంప్రెస్ చేసిందట. అంతే కాదు తాను నటిస్తున్న ఫస్ట్ లేడీ ఓరియెంటెడ్ సినిమా, అందులోను తనకు 50వ సినిమా కావడంతో ఈసినిమా తనకు ఎంతో ప్రత్యేకం అంటోంది హన్సికా. 

68

అంతే కాదు ఈ సినిమాలో మరో ప్రత్యేకత ఏంటీ అంటే.. ఇప్పటి వరకూ గ్లామర్ పాత్రలకు పరిమితం అయినహన్సికా.. ఇందులో ఒక బిడ్డకు తల్లిగా నటించింది.  ఎన్నో కష్టాలను ఎదుర్కొనే పాత్ర అది. నేను ఇంత వరకు చేయనటువంటి పాత్ర... నటనకు అవకాశం ఉన్న పాత్ర అందులోను అన్ని రకాల ఎమోషన్స్‌ ఉన్న పాత్ర కావడంతో ఈ సినిమాను అంగీకరించానంటోంది హన్సికా మోట్వాని. 
 

78

మహా సినిమాలో లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి అంటోంద హన్సికా.. ఈ క్యారెక్టర్ తనుకు ఛాలెంటజ్ అనిపించిందంటోంది. అందుకే పట్టు బట్టి..  ఈ పాత్రకు న్యాయం చేశానంటోంది. సినిమా బాగా వచ్చిందని.. అది అందరు మెచ్చే  సినిమా అవుతుందంటోంది. హన్సికా.  అంతే కాదు తన సినీ కెరియర్‌లో మైలురాయిగా  ఈ సినిమా నిలిచిపోతుందట.  

88

ప్రస్తుతం తెలుగు ,తమిళ భాషల్లో కలిపి 10  సినిమాలు  చేస్తుంది హన్సీకా. ఈ కరోనా గ్యాప్ ను కవర్ చేయడం కోసం ఈ ఏడాది వరుసగా సినిమాలు సైన్ చేస్తోంది. అంతే కాదు గ్యాప్ లేకుండా ఆసినిమాలు కంప్లీట్ చేసే పనిలో పడింది బ్యూటీ. 

click me!

Recommended Stories