పేరుకు స్టార్ హీరోల సినిమాలలో అవకాశామే అయినా సదరు హీరోయిన్స్ కెరీర్ కి అవి ఏమాత్రం ఉపయోగపడలేదు. వయసులో చిన్నదైనా శ్రీలీల మహేష్ మూవీ అనగానే టెంప్ట్ కాకుండా, తన పాత్రలో మార్పులు చేయించి ఎంతో కొంత ప్రయోజనం పొందే ప్రయత్నం చేసింది. అదే సమయంలో మహేష్ (Mahesh babu)సినిమాలో ఆఫర్ అంటే ఎలాంటి కండీషన్స్ పెట్టకుండా ఒప్పుకునే హీరోయిన్స్ అనేక మంది ఉన్నారు.