Anand Deverakonda HBD : ఆనంద్ దేవరకొండ బర్త్ డే సెలబ్రేషన్స్.. ‘బేబీ, హైవే’ల నుంచి న్యూ పోస్టర్స్ రిలీజ్..

Published : Mar 15, 2022, 05:11 PM IST

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) తన పుట్టిన రోజు వేడుకులను ఇంట్లోనే కుటుంబ సభ్యుల మధ్య జరుపుకున్నారు. అయితే ఆయన బర్త్ డే సందర్భంగా తన అప్ కమింగ్ ఫిల్మ్ నుంచి మేకర్స్ కొత్త పోస్టర్స్ రిలీజ్ చేశారు.

PREV
16
Anand Deverakonda HBD : ఆనంద్ దేవరకొండ బర్త్ డే సెలబ్రేషన్స్.. ‘బేబీ, హైవే’ల నుంచి న్యూ పోస్టర్స్ రిలీజ్..

ఆనంద్ దేవరకొండ గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రియమైన,  ప్రతిభావంతులైన నటులలో ఒకరని చెప్పొచ్చు.  ‘దొరసాని’, ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత గతేడాది ‘పుష్పక విమానం’తో వచ్చాడు. 
 

26

అయితే ఈ రోజు ఆనంద్ దేవరకొండకు చాలా ప్రత్యేకమైన రోజు. ఆయన పుట్టిన రోజు. దీంతో ఆయన జన్మదిన వేడుకలను తన ఫ్యామిలీ మెంబర్స్ తోనే సెలబ్రేట్ చేసుకున్నాడు. అమ్మా నాన్న తోపాటు అన్న విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కూడా బర్డ్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. ఆనంద్ తో కేక్ కట్ చేయించి స్వీట్లు తినిపించారు. కుటుంబ సభ్యులే కాకుండా ఆనంద్ కు తన స్నేహితులు, అభిమానులు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 
 

36

అలాగే, తనను నటిస్తున్న బేబీ, హైవే చిత్రాల నుంచి ఆనంద్ పుట్టిన రోజు సందర్భంగా కొత్త పోస్టర్లను రిలీజ్ చేశారు. చిత్రా యూనిట్స్ ఆయనకు హార్ట్లీ విషెస్ తెలియజేశాయి. ఆనంద్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా `హైవే`. ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కేవీ గుహ‌న్ ద‌ర్శక‌త్వంలో రూపొందుతోందీ  సైకో క్రైమ్‌ థ్రిల్లర్ చిత్రం. మానస రాధాకృష్ణన్‌ హీరోయిన్‌గా న‌టిస్తోంది.  
 

46

`హైవే` చిత్రం నుంచి వచ్చిన కొత్త పోస్టర్ ఆకట్టుకుంటోంది. హిల్ స్టేషన్ లో ఈ యువహీరో టూర్ ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తోందీ పోస్టర్. కొండ రాయిపై కూర్చుని చుట్టూ అందమైన నేచర్ ను చూస్తున్నారు. ఈ పోస్టర్ ను విడుదల చేస్తూ ఆనంద్ కు విషెస్ తెలిపారు. 

56

ఆనంద్ దేవరకొండ నటిస్తున్న మరో కొత్త సినిమా 'బేబీ'.  ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్ కే ఎన్, దర్శకుడు మారుతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తున్నారు. విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆనంద్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి కూడా కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.

66

ఈ పోస్టర్ చూస్తే..వాడిన రోజా పువ్వును హీరో ఆనంద్ దేవరకొండ పట్టుకుని తీక్షణంగా చూస్తున్నారు. రోజ్ ఫ్లవర్ ఇస్తూ ఆమె స్పందన కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఓల్డ్ రోజ్ ఫ్లవర్ వెనక దాగి ఉన్న కథేంటి అనేది సినిమాలో చూడాలి. ఈ పోస్టర్ తో ఆనంద్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు టీమ్ మెంబర్స్. అలాగే ఆనంద్ ‘గం గం గణేశా’ మూవీలోనూ నటిస్తున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories