అలా అయితే `ఆర్‌ఆర్‌ఆర్‌` చేసేవాళ్లం కాదు.. రాజమౌళిపై ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ సెన్సేషనల్‌ కామెంట్‌

Published : Mar 15, 2022, 05:46 PM ISTUpdated : Mar 16, 2022, 10:02 AM IST

ఇండియన్‌ ప్రస్టీజియస్‌ మూవీ `ఆర్‌ఆర్‌ఆర్‌`. రాజమౌళి, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లు కాకుండా ఈ సినిమాని ఊహించుకోవడం కష్టమే. కానీ నిజంగానే అలాంటి పరిస్థితి వస్తే.. దీనిపై ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ స్పందించారు. 

PREV
18
అలా అయితే `ఆర్‌ఆర్‌ఆర్‌` చేసేవాళ్లం కాదు.. రాజమౌళిపై ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ సెన్సేషనల్‌ కామెంట్‌

దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) ఊహకి ప్రతిబింబం `ఆర్‌ఆర్‌ఆర్‌`(RRR). స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, నైజాంతో పోరాడిన తెలంగాణ వీరుడు కొమురంభీమ్‌ యంగ్‌ ఏజ్‌లో ఏం చేశారనే కల్పిత కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించినట్టు దర్శకుడు రాజమౌళి తెలిపారు. పూర్తి ఫిక్షన్‌ స్టోరీని ఈ చిత్రంలో చూపించబోతున్నట్టు తెలిపారు. వీరిద్దరు యోధులు కలిసి పోరాడితే ఎలా ఉంటుందనే ఆలోచనకి ప్రతిరూపమే `ఆర్‌ఆర్‌ఆర్‌` అన్నారు. 

28

స్నేహం ప్రధానంగా సినిమా సాగుతుందని చెప్పారు రాజమౌళి. అందుకే ఇండస్ట్రీలో మంచి స్నేహితులైన ఎన్టీఆర్‌(NTR), రామ్‌చరణ్‌(Ram Charan)లను తీసుకున్నట్టు చెప్పారు. వారి ఇమేజ్‌ని, ఫ్యాన్‌ ఫాలోయింగ్‌, మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకుని వారిని ఎంపిక చేశామన్నారు. ఇద్దరూ సెట్‌లో అద్భుతంగా చేశారని చెప్పిన రాజమౌళి ఎన్టీఆర్‌ని సూపర్‌ కంప్యూటర్‌తో పోల్చారు. మనం చెబుతుంటేనే ఆ సీన్‌ ఎలా చేయాలో ఊహించుకుంటారు, తాను అనుకున్నట్టు చేస్తారని తెలిపారు. రామ్‌చరణ్‌ క్లీన్‌ వైట్‌ పేపర్‌ అని, సెట్‌లో మనం ఏం చెబితే అది పర్‌ఫెక్ట్ గా దించేస్తాడని నటులుగా వారి మధ్య డిఫరెంట్స్ అదేనని తెలిపారు రాజమౌళి. 

38

ఇదిలా ఉంటే రాజమౌళి కాకుండా `ఆర్‌ఆర్‌ఆర్‌` చేయాల్సి వస్తే, ఎవరితో చేస్తారనే మీడియా ప్రశ్నకి ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ స్పందించారు. జక్కన్న లేకుండా జరిగితే అసలు `ఆర్‌ఆర్‌ఆర్‌`ని చేసేవాళ్లం కాదని స్పష్టం చేశారు. రాజమౌళి లేకుండా `ఆర్‌ఆర్‌ఆర్‌`ని ఊహించుకోలేమన్నారు. ఇలాంటి ఐడియా మరెవ్వరికీ రాదని తెలిపారు. ఇలాంటి సినిమాలు ఏ ఇతర దర్శకుడు చేయలేరని తెలిపారు. 

48

అదే సమయంలో ఒకరి పాత్రలను మరొకరు చేయాలని ఎప్పుడైనా అనిపించిందా? అనే ప్రశ్నకి ఇద్దరు స్పందిస్తూ ఎప్పుడూ అలాంటి ఫీలింగ్‌ కలగలేదు. మా పాత్రలు చేసేందుకే నానా తంటాలు పడేవాళ్లమని, మరో పాత్ర గురించి ఆలోచించేవాళ్లం కాదని తెలిపారు. అయితే సెట్‌లో ఒకరి నటన చూసి ఇన్‌స్పైర్‌ అయ్యేవాళ్లమని చెప్పారు. ఎన్టీఆర్‌ చెబుతూ, కొన్ని సీన్లు చరణ్‌ నటన భలేగా అనిపించేదన్నారు. ఎప్పుడైనా మనం కూడా ఇలా ట్రై చేయోచ్చేమో అనిపించేదన్నారు. అలాగే చరణ్‌ స్పందిస్తూ, ఎన్టీఆర్‌ నటన సర్‌ప్రైజింగ్‌గా ఉండేదన్నారు. 

58

ఇక ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ పాత్రల ఇమేజ్‌ని ఎలా బ్యాలెన్స్ చేశారనే ప్రశ్నకి రాజమౌళి స్పందిస్తూ, తాను ఇద్దరు హీరోల పాత్రల నిడివి, సీన్లని, పంచ్‌లను, డైలాగ్‌లను, యాక్షన్‌ సీక్వెన్స్ ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఎవరిని ఎంత వరకు చూపించాలని ఎప్పుడూ ఆలోచించలేదన్నారు. అలా చేస్తే దర్శకుడిగా తాను ఫెయిల్‌ అయినట్టేనని చెప్పారు రాజమౌళి. తాను అనుకున్న కథని పాత్రల ద్వారా ఎలా చెప్పాలి, ఆయా పాత్రలు ఆడియెన్స్ కి ఒకేలా ఎలాకనెక్ట్ చేయాలనేదే ఆలోచించానని తెలిపారు.

68

ఎన్టీఆర్‌తో సెట్‌లో కష్టమని సరదాగా చెప్పారు. ఈ సమయంలో ఎన్టీఆర్‌ రియాక్ట్ అవ్వడంతో చరణ్‌వైపు చూపించాడు జక్కన్న కాసేపు నవ్వులు పూయించారు. అయితే ఎన్టీఆర్‌ ఏదీ దాచుకోలేడని, చిన్న పిల్లాడిలా రియాక్ట్ అవుతుంటాడు. ఎమోషన్స్ ఎక్కువ అని, ఆయనకు కొమురంభీమ్‌ పాత్ర సూట్‌ అవుతుందనిపించి ఆయన్ని ఎంపిక చేసుకున్నానని, 

78

 రామ్‌చరణ్‌ చాలా సెటిల్డ్ అని, అన్ని తనలో దాచుకుంటాడని, ఎలాంటి సమస్య వచ్చినా కూల్‌గా డీల్‌ చేస్తారని, బెదిరిపోడని, అందుకే అల్లూరి పాత్రకి ఆయన్ని ఎంపిక చేసుకున్నట్టు చెప్పారు రాజమౌళి.  అలియాభట్‌, అజయ్‌ దేవగన్‌ పాత్రలను తీసుకోవడం ఉద్దేశం కూడా వారు మాత్రమే ఆయా పాత్రలకు సెట్‌ అవుతారని భావించి ఎంపిక చేశామని, మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకుని కాదన్నారు. ఈ సినిమా ఎమోషనల్‌ డ్రైవ్‌ అని వెల్లడించారు.

88

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా  రాజమౌళి రూపొందించిన భారీ మల్టీస్టారర్‌ చిత్రం `ఆర్‌ఆర్‌ఆర్‌`. ఈ సినిమా నిర్మాత డివివి దానయ్య దాదాపు 450కోట్లతో నిర్మించారు. అలియాభట్‌, బ్రిటీష్‌ నటి ఒలివియా మోర్రీస్‌ కథానాయికలుగా, అజయ్‌ దేవగన్‌, శ్రియా, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతుందన్నారు. `బాహుబలి`ని మించి ఉంటుందని పేర్కొన్నారు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories