పెళ్లై ఏడాది తిరక్కముందే తండ్రి కాబోతున్న యంగ్ హీరో, డిఫరెంట్ గా ప్రకటించిన కిరణ్ అబ్బవరం..

Published : Jan 21, 2025, 12:38 PM IST

పెళ్ళై ఏడాది కూడా తిరిగి రాలేదు.. అప్పుడే తాము తల్లీ తండ్రులు కాబోతున్నాంటూ ప్రకటించారు యంగ్ హీరో కిరణ అబ్బవరం దంపతులు. 

PREV
15
పెళ్లై ఏడాది తిరక్కముందే తండ్రి కాబోతున్న యంగ్ హీరో, డిఫరెంట్ గా ప్రకటించిన కిరణ్ అబ్బవరం..

టాలీవుడ్ యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం తండ్రి కాబోతున్నారు.  త‌న భార్య ర‌హ‌స్య గోర‌క్‌ బేబీ బంప్‌తో ఉన్న ఫొటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన కిరణ.. డిఫరెంట్ గా ప్రకటించాడు. ఎక్స్ లో ఫోటో శేర్ చేస్తూ.. ఆయన ఇలా రాసుకొచ్చారు. మా ప్రేమ 2 అడుగుల మేర పెరుగుతోంది" అని ట్వీట్ చేశారు. దీంతో ఇండస్ట్రీ నుంచే కాకుండా..  కిర‌ణ్ అబ్బ‌వ‌రం ఫ్యాన్స్ కూడా ఈ దంప‌తుల‌కు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. 

Also Read: విరాట్ కోహ్లీ మరదలు.. టాలీవుడ్ ఫేమస్ హీరోయిన్
 

25

పోయిన ఏడాది అగస్ట్ లో  పెళ్ళి పీటలు ఎక్కాడు కిరణ్ అబ్బవరం. తనతోకలిసి నటించిన హీరోయిన్ రహస్య గోరక్ ను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు కిరణ్. మంచి కథలు సెలక్ట్ చేసుకుంటూ.. వరుసగా సినిమాలు చేస్తూ వచ్చాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ.. ఎదుగుతూ వచ్చాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో హీరో మెటీరియల్ అని నిరూపించుకున్నవారి లిస్ట్ లో కిరణ్ చేరిపోయాడు. 

Also Read:అఖండ 2 లో బాలయ్య సెంటిమెంట్ హీరోయిన్..? కలిసి వస్తుందని పెట్టారా, ఎవరామె..?

35

మరి ముందు ముందు స్టార్ డమ్ అందుకుంటాడా.. లేక టైర్ 2 హీరోల లిస్ట్ లో ఉండిపోతాడా అనేది చూడాలి. ఫస్ట్ సినిమా రాజావారు రాణివారుతో తెలుగు ఆడియన్స్ ను మెప్పించాడు కిరణ్ అబ్బవరం. ఈసినిమా తరువాత ఈ హీరో నుంచి ఏ సినిమా వచ్చినా.. జనాలు బాగా ఇంట్రెస్ట్ పెట్టి చూడటం స్టార్ట్ చేశారు.

ఇక అప్పటి నుంచి వరుసగా డిఫరెంట్ కాన్సెప్ట్ లను సినిమాలు గా చేస్తూ వస్తున్నాడు కిరణ్. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నా సరే.. సబ్జెక్ట్ లేని సినిమాలను రిజెక్ట్ చేస్తూ.. తనకంటూ  ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ను ఇండస్ట్రీలో ఏర్పాటు చేసుకున్నాడు కిరణ్ అబ్బవరం. 

Also Read:గేమ్ ఛేంజర్ ఫ్లాప్ కు పవన్ కళ్యాణ్ కు సంబంధం ఏంటి..? యాంటీ ఫ్యాన్స్ ఏం చెపుతున్నారంటే..?

45

'రాజావారు రాణివారు'తో పాటు కిరణ్ హిట్ సినిమాల లిస్ట్ లో  'ఎస్ఆర్ క‌ళ్యాణ మండ‌పం', 'విన‌రో భాగ్యం విష్ణు క‌థ‌', 'క' వంటి మంచి హిట్ చిత్రాలు ఉన్నాయి.  ఇక రీసెంట్ గా 'క' మూవీతో మరోసారి తన స్టైల్ ను నిరూపించాడు కిరణ్. ఈసినిమాతో  సూప‌ర్ హిట్‌ అందుకున్నారు. త్వ‌ర‌లోనే 'దిల్‌రూబా' సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు. తాజాగా విడుద‌లైన ఈ చిత్రం టీజ‌ర్ ఆక‌ట్టుకుంటోంది. ఓ డిఫ‌రెంట్ ల‌వ్‌స్టోరీతో ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్న‌ట్లు మేక‌ర్స్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. 

Also Read:జూనియర్ ఎన్టీఆర్ హాలీవుడ్ ఎంట్రీ.. హింట్ ఇచ్చిన దర్శఖుడు ఎవరో తెలుసా..?

55

ఇకపోతే కిరణ్ అబ్బవరం, రహస్య ఘోరక్ ఇద్దరూ కూడా 2019లో “రాజావారు రాణిగారు” అనే సినిమాలో నటించారు. అదే సమయంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిందట. ఇక అందులో భాగంగానే గత ఏడాది మార్చి 13వ తేదీన హైదరాబాదులో వీరి నిశ్చితార్థం జరిగింది. ఇక ఐదేళ్ల ప్రేమకు పులిస్టాప్ పెడుతూ కర్ణాటకలో కూర్గ్ లో 2024 ఆగస్టు 22న వివాహం చేసుకున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories