రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'కాంతారా 2' చిత్రానికి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. ఈ షూటింగ్ జరుపుకొంటున్న ప్రదేశంలో నిబంధనలు ఉల్లంఘిస్తే షూటింగ్ ను అర్ధాంతరంగా నిలిపివేస్తామని కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే చిత్రబృందాన్ని హెచ్చరించారు. అయితే ఇంతకుముందు వచ్చిన ఆరోపణలపై జరిపిన దర్యాప్తులో చిత్ర సభ్యులు ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని ఆయన చెప్పడం ఊరటనిచ్ఛే విషయం.
'కాంతార 2' 'కాంతార' చిత్రానికి ప్రీక్వెల్‌గా వస్తున్న విషయం తెలిసిందే. కొన్నాళ్లుగా చిత్రబృందం గవిగుడ్డ అటవీ ప్రాంతంలో షూటింగ్ చేస్తోంది. ఈ చిత్రీకరణ సమయంలో వన్యప్రాణులు, అడవులకు హాని కలిగించినట్లు స్థానికులు తీవ్ర ఆరోపణలు చేసారు. జంతువులు, పక్షులను ఇబ్బంది పెడుతున్నారని వాళ్ళు ఆందోళన చేసారు.
25
మంత్రి విచారణ జరిపించారు
కర్ణాటక అటవీ మంత్రి ఈశ్వర్ ఖండ్రే ఈ ఆరోపణలపై స్పందిస్తూ, ప్రాథమిక దర్యాప్తు తర్వాత చిత్ర బృందాన్ని నిర్దోషులుగా ప్రకటించారు. అడవిలో పేలుడు పదార్థాలు వాడుతున్నట్లు వార్తలు రావడంతో ఆయన వెంటనే స్పందించి, ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని నిర్ధారించుకోవడానికి 24 గంటల్లోపు వివరణాత్మక దర్యాప్తు కోరారు.
35
చిత్రీకరణకు అనుమతి
గవిగుడ్డ అటవీ శ్రేణిలో 23 రోజుల పాటు చిత్రీకరణకు అనుమతి లభించిందని, జనవరి 25 వరకు గడువు ఉందని ఖండ్రే వెల్లడించారు. అయితే, దర్యాప్తులో ఏదైనా చట్టవిరుద్ధ కార్యకలాపాలు లేదా పర్యావరణానికి హాని జరిగినట్లు తేలితే చిత్రీకరణను వెంటనే నిలిపివేస్తామని ఆయన స్పష్టం చేశారు.
45
స్థానికుల ఆందోళన
జిల్లా పంచాయతీ మాజీ సభ్యుడు సన్న స్వామితో సహా స్థానికులు చిత్ర నిర్మాణం వల్ల కలిగిన నష్టం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే ఉన్న అడవి ఏనుగుల దాడుల సమస్యను వారు ఎత్తి చూపారు.
55
చిత్ర బృందం, స్థానికుల ఘర్షణ
చిత్రీకరణ సమయంలో చిత్ర బృందం, స్థానికుల మధ్య ఉద్రిక్తతలు పెరిగి, ఘర్షణ జరిగింది. దీనిపై యేసలూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కాంతార2 అక్టోబరు 2న విడుదల కానుంది.