ఈ చిత్ర షూటింగ్ మొత్తం న్యూజిలాండ్ లోనే పూర్తి చేయనున్నారు. దీనితో అవసరమైన సెట్ మెటీరియల్, సామాగ్రిని ఇటీవల న్యూజిలాండ్ తరలించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కొన్ని షెడ్యూల్స్ కూడా పూర్తయ్యాయి. ఈ చిత్రంలో నటించే బ్రహ్మానందం, సప్తగిరి, రఘుబాబు, సురేఖ వాణి లాంటి నటులంతా న్యూజిలాండ్ వెళ్లిన సంగతి తెలిసిందే.