తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ ఫినాలే ఫీవర్ నడుస్తుంది. బిగ్ బాస్ తెలుగు 7 టైటిల్ విన్నర్ ఎవరనే చర్చ జోరుగా సాగుతుంది. ఫినాలే వీక్ కి ముందు శోభ శెట్టి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఆమె నిష్క్రమణ తర్వాత హౌస్లో ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. శివాజీ, అర్జున్, అమర్, ప్రశాంత్, యావర్, ప్రియాంకలను ఫైనలిస్ట్స్ గా నాగార్జున ప్రకటించారు.