Pindam Movie Review:'పిండం' మూవీ రివ్యూ, రేటింగ్

First Published Dec 15, 2023, 11:26 AM IST

డెబ్యూ డైరెక్టర్ సాయికిరణ్ దైదా దర్శకత్వంలో శ్రీనివాస్ అవసరాల, శ్రీరామ్, ఖుషి రవి, ఈశ్వరి రావు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం పిండం. హర్రర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కలాహి మీడియా బ్యానర్ లో యశ్వంత్ దగ్గుమాటి నిర్మించారు. 

డెబ్యూ డైరెక్టర్ సాయికిరణ్ దైదా దర్శకత్వంలో శ్రీనివాస్ అవసరాల, శ్రీరామ్, ఖుషి రవి, ఈశ్వరి రావు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం పిండం. హర్రర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కలాహి మీడియా బ్యానర్ లో యశ్వంత్ దగ్గుమాటి నిర్మించారు. డిసెంబర్ 15న శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సస్పెన్స్, హర్రర్ ఎలిమెంట్స్ ఉండే చిత్రాలని ఇష్టపడే ఆడియన్స్ లో ఈ మూవీ క్యూరియాసిటీ పెంచింది. 

మరణం తర్వాత ఏం జరుగుతుంది.. నిజంగానే ఆత్మలు ఉంటాయా? కోరికలు తీరకుండా మరణించినవారు ఆత్మలుగా మారతారా ? అనే విషయాలని తెలుసుకునే వ్యక్తిగా శ్రీనివాస్ అవసరాల నటించాడు. తమని వెంటాడుతున్న ఆత్మల నుంచి ఫ్యామిలీని రక్షించుకునే వ్యక్తిగా శ్రీరామ్ నటించాడు. ఆత్మలగురించి అన్ని విషయాలు తెలిసిన తాంత్రిక శక్తి ఉన్న వ్యక్తిగా ఈశ్వరి రావు కనిపించారు. మరి ఈ చిత్రం అంచనాలకు తగ్గట్లుగా ఉందో లేదో ఇప్పుడు సమీక్షలో చూద్దాం. 

కథ :

తాంత్రిక శక్తులపై, మరణం తర్వాత ఏమవుతుంది, ఆత్మలు నిజంగానే భయపెడతాయా లాంటి విషయాలపై పరిశోధనలు చేసే లోక్ నాథ్( శ్రీనివాస్ అవసరాల). అతడు ఒకసారి అన్నమ్మ(ఈశ్వరి రావు)ని కలుస్తాడు. తన సందేహాల్ని ఆమె ద్వారా తీర్చుకునే ప్రయత్నం చేస్తాడు. తన తండ్రి ద్వారా ఈశ్వరి రావుకి తాంత్రిక శక్తులు వస్తాయి. తనకున్న తాంత్రిక శక్తితో ఈశ్వరి రావు ఆత్మల బారీన పడ్డ వారికి సాయం చేస్తూ రక్షిస్తూ ఉంటుంది. 

అయితే తన శక్తికే సవాల్ విసిరిన ఓ సంఘటనని ఈశ్వరి రావు.. శ్రీనివాస్ అవసరాలకి చెబుతుంది. 1990లో జరిగిన సంఘటన అది. ఓ రైస్ మిల్ లో అకౌంటెంట్ గా పనిచేసే అంథోని (శ్రీరామ్) ఊరి చివర ఓ ఇల్లు కొంటాడు. భార్య పిల్లలు,  తల్లితో ఆ ఇంట్లోకి మారుతాడు. అప్పటికి శ్రీరామ్ భార్య గర్భంతో ఉంటుంది. ఆమెని తప్ప మిగిలిన వారందరిని ఆత్మలు వేధించడం ప్రారంభిస్తాయి. 

Latest Videos


ఆత్మల భయం నుంచి ఇంట్లో నుంచి వెళ్లిపోవాలనుకున్నా అవి వెళ్లనివ్వవు. దీనితో శ్రీరామ్ ఈశ్వరి రావు సాయం తీసుకుంటాడు. ఈశ్వరి రావు ఆ ఆత్మల గురించి ఏం తెలుసుకుంది ? శ్రీరామ్ ఫ్యామిలీకి ఆత్మల నుంచి విముక్తి కలిగించిందా ? ఆ ఆత్మల ఫ్లాష్ బ్యాక్ ఏంటి ? ఎందుకు శ్రీరామ్ ఫ్యామిలీని టార్గెట్ చేసాయి లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రం చూడాల్సిందే. 

విశ్లేషణ :

సినిమా మొత్తం భయపెట్టి ఫ్లాష్ బ్యాక్ లో కథని రివీల్ చేసి విజయం సాధించాలని డైరెక్టర్ సాయికిరణ్ దైదా ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో ఆయన కొంతవరకు మాత్రమే సఫలం అయ్యారు. దాదాపు అన్ని హర్రర్ చిత్రాల్లో ఉండే స్క్రీన్ ప్లేనే ఈ చిత్రం లో కూడా కనిపిస్తుంది. కథలో పెద్దగా కొత్తదనం ఉండదు. ఊరిచివరన ఇల్లు ఉండడం, ఒక గదిని ఎవరూ ఉపయోగించకపోవడం ఏ తరహా కథని చాలా సార్లు చూసే ఉంటాం. 

అయితే ఆరంభంలో ఆడియన్స్ లో ఆసక్తిని పెంచుతూ భయపెట్టడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. కానీ ఆరంభంలో వచ్చిన సన్నివేశాలే రిపీట్ అవుతున్నట్లు అనిపిస్తుంది. ఆత్మలు కనిపించడం.. ఆ సమయంలో కుర్చీలు ఊగడం.. కిటికీలు కొట్టుకోవడం లాంటి సీన్స్ తరచుగా వస్తుంటాయి. దీనితో థ్రిల్ మిస్సవుతుంది. ఫస్ట్ హాఫ్ లో ఒక ట్విస్ట్ తో కథపై ఆసక్తిని పెంచారు. 

తాంత్రిక శక్తులు కలిగిన అన్నమ్మ(ఈశ్వరి రావు) పాత్ర ఎంట్రీతో కాస్త ఆసక్తి పెరుగుతుంది. ఆ ఆత్మలు ఎక్కడి నుంచి వచ్చాయి.. అసలు శ్రీరామ్ ఫ్యామిలీని ఎందుకు వేధిస్తున్నాయి అనే ప్రశ్నపై ఉత్కంఠ కొనసాగుతుంది తప్ప మిగిలిన సీన్స్ రొటీన్ గా ఉంటాయి. ఈశ్వరి రావు తన శక్తితో ఆత్మలతో మాట్లాడడం వాటి గత చరిత్ర తెలుసుకునే సన్నివేశాలు బావుంటాయి. 

అయితే ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఆత్మల ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అంతగా పండలేదు. ఆత్మల ఫ్లాష్ బ్యాక్ కి ఆడియన్స్ కనెక్ట్ కావాలి అంటే బలమైన ఎమోషన్స్ కన్విన్స్ చేసే సీన్స్ అవసరం. కానీ ఫ్లాష్ బ్యాక్ లో వయెలెన్స్ ఎక్కువగా ఉంటుంది తప్ప కన్విన్స్ చేసే పాయింట్ ఉండదు. అసలు ఈ చిత్ర టైటిల్  పిండంకి ఆత్మలకి మధ్య లింక్ ఏంటి అనే పాయింట్ కూడా ఆసక్తికరంగా ఉండదు. 

నటీనటులు : 

మధ్య తరగతి ఫ్యామిలిలో భర్యాభర్తలుగా శ్రీరామ్, ఖుషి రవి చక్కగా ఒదిగిపోయారు. శ్రీరామ్ తన ఫ్యామిలీని రక్షించుకోవడం కోసం పడే తపన, అతడి నటన మెప్పిస్తుంది. ఇక ఈశ్వరి రావుకి వైవిధ్యమైన పాత్ర దొరికింది అనే చెప్పాలి. ఆ రోల్ లో ఆమె అద్భుతంగా నటించారు. ఈ చిత్రానికి అత్యంత కీలకమైన పాత్ర ఈశ్వరి రావుదే. ఈశ్వరి రావు, శ్రీరామ్, ఖుషి రవి మధ్యే ఎక్కువ సన్నివేశాలు ఉంటాయి. శ్రీనివాస్ అవసరాల ఆత్మలపై పరిశోధన చేసే వ్యక్తిగా కనిపించినప్పటికీ ఆయన పాత్రకి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. 

టెక్నికల్ గా :

సంగీత దర్శకుడు కృష్ణ సౌరభ్ బ్యాగ్రౌండ్ సంగీతం భయపెట్టే విధంగా సాగుతూ చిత్రానికి బాగా ప్లస్ అయింది. దర్శకుడు విషయానికి వస్తే ఆడియన్స్ భయపెట్టడమే హర్రర్ చిత్రాల ఉద్దేశం కాదు. అందుకు తగ్గట్లుగా థ్రిల్లింగ్ అనిపించే కథ కూడా ఉండాలి. భయపెట్టడంలో డైరెక్టర్ కొంతవరకు సక్సెస్ అయ్యారు కానీ కథని ఇంకాస్త కొత్తగా ప్రజెంట్ చేసి ఉంటె బావుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బావున్నాయి. 

ఫైనల్ థాట్ : 'పిండం' భయపెడుతుంది కానీ థ్రిల్ చేయదు.. హర్రర్ లవర్స్ ఒకసారి ట్రై చేయొచ్చు. 

రేటింగ్ : 2.75 

click me!