బ్లాక్ ఫిట్ లో ‘ధమాకా’ పిల్లా మైండ్ బ్లోయింగ్ పోజులు.. కవ్వించడంలో కుర్ర భామ రూటే వేరే!

First Published | Feb 16, 2023, 11:13 AM IST

‘ధమాకా’ బ్లాక్ బాస్టర్ హిట్ తో యంగ్ హీరోయిన్ శ్రీలీలా (Sreeleela) జోరు మరింత పెరిగిపోయింది. దీంతో వరుస ఆఫర్లను అందుకుంటోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటోంది. 
 

యంగ్ హీరోయిన్  శ్రీలీలా  పేరు టాలీవుడ్ లో ప్రస్తుతం జోరుగా వినిపిస్తోంది. ఏ కొత్త ప్రాజెక్ట్ వస్తున్నా.. అందులోని ఆయా పాత్రలకు  శ్రీలీలా పేరు పరిశీలిస్తుండటం గమనార్హం. కొద్ది సమయంలోనే యంగ్ బ్యూటీ ఇంత క్రేజ్ దక్కించుకోవడం విశేషం. 
 

‘పెళ్లి సందD’ చిత్రంతో శ్రీలీలాకు మంచి గుర్తింపు వచ్చింది. తన నటన, డాన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది. మరోవైపు గ్లామర్ పరంగానూ ఆకట్టుకున్నారు. ఈ చిత్రం అంతంత మాత్రానా ఆడినా.. శ్రీలీల కేరీర్ ను మాత్రం మలుపు తిప్పింది. ప్రస్తుతం టాలీవుడ్ లో దూసుకెళ్తోంది.


మరోవైపు సోషల్ మీడియాలోనూ శ్రీలాలా యాక్టివ్ గా కనిపిస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భంగా బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లు చేస్తూ నెటిజన్లను తనవైపు తిప్పుకుంటున్నారు. ఈ క్రమంలో శ్రీలీలా లేటెస్ట్ ఫొటోషూట్ స్టన్నింగ్ గా ఉంది.
 

బ్లాక్ అవుట్ ఫిట్ లో బిగుతైన అందాలను ప్రదర్శిస్తూ ఫొటోషూట్ చేశారు శ్రీలీలా. టైట్ ఫిట్ లో స్లిమ్ ఫిట్ స్ట్రక్చర్ ను చూపిస్తూ కుర్రాళ్ల మతులు పోయేలా చేసింది. స్టన్నింగ్ పోజులతో చూపుతిప్పుకోనివ్వకుండా చేసింది. మరోవైపు మత్తు చూపులతోనూ మైమరిపించేసింది.
 

ఈ సందర్భంగా శ్రీలీలా పంచుకున్న ఫొటోలోపై ఫ్యాన్స్, నెటిజన్లు కూడా క్రేజీగా స్పందిస్తున్నారు. తను ఇండస్ట్రీలో దూసుకెళ్తుండటం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు తన అందాన్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. ఇంకొందరు గ్లామర్ తో అట్రాక్ట్ చేయడంలో శ్రీలీలా రూటే సపరేటంటూ అభిప్రాయపడుతున్నారు. 
 

ఈ బ్యూటీ చేతినిండా సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబు - త్రివిక్రమ్ సినిమాలోనూ హీరోయిన్ గా నటిస్తోంది. నితిన్ తదుపరి చిత్రంలోనూ శ్రీలీలానే హీరోయిన్ అంటున్నారు. ఇక నందమూరి బాలయ్య - అనిల్ రావిపూడి కాంబోలోని ‘ఎన్బీకే108’లోనూ ఈ బ్యూటీ కనిపించబోతుందని తెలుస్తోంది. 
 

Latest Videos

click me!