గులాబీకి బేబమ్మ ముద్దులు.. క్యూట్ లుక్స్ తో కట్టిపడేస్తోందే.. అందుకేనా కుర్రాళ్లలో ఇంత క్రేజ్..

First Published | Jan 31, 2023, 11:11 AM IST

యంగ్ హీరోయిన్ కృతి శెట్టి (Krithi Shetty) క్యూట్ లుక్స్ తో కుర్ర గుండెల్లో గంటలు మోగిస్తోంది. రోజురోజుకు మరింత అందంగా దర్శనమిస్తూ యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. లేటెస్ట్ పిక్స్ తో ఆకర్షిస్తోంది.
 

‘ఉప్పెన’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన కృతి శెట్టి ప్రస్తుతం టాలీవుడ్ లో దూసుకుపోతోంది. తొలిసినిమాతోనే హిట్ ఖాతాను ఓపెన్ చేసిన ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోల సరసన నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.
 

కేరీర్ ప్రారంభంలోనే కృతి శెట్టి వరుసగా మూడు చిత్రాలతో హిట్లు అందుకుని హ్యాట్రిక్ హీరోయిన్ గా పేరొందింది. దీంతో కృతిపై భారీ అంచనాలు పెరిగాయి. ఆమె చేసిన ప్రతి సినిమా విజయవంతం సాధించడంతో వరుస ఆఫర్లు వచ్చి చేరాయి.
 


చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీ  అయిన కుర్ర భామకు గతేడాది కాస్తా చేధు అనుభవం ఎదురైంది. హ్యాట్రిక్ హిట్ సొంతం చేసుకున్న కృతి శెట్టి.. గతేడాది విడుదలైన ‘ది వారియర్’, ‘మాచర్ల నియోజకవర్గం’, ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’చిత్రాలతో హ్యాట్రిక్ ఫ్లాప్స్ ను కూడా మూటగట్టుకుంది.  
 

ఇక తన అప్ కమింగ్ ఫిల్మ్స్ పై ఆశలు పెట్టుకుంది. వచ్చే సినిమాలు  హిట్ అయితేనే బేబమ్మ కేరీర్ జోరుగా సాగుతుందని లేదంటే కష్టాలు తప్పవని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో అటు సినిమాలను ప్రకటిస్తూనే ఇటు ఫ్యాన్స్ కూ దగ్గరయ్యే పని చేస్తోంది.
 

ఈ సందర్భంగా సోషల్ మీడియాలోనూ కృతి శెట్టి యాక్టివ్ గా కనిపిస్తున్నారు. వరుస ఫొటోషూట్లతో ఫ్యాన్స్ ను ఫిదా చేస్తున్నారు. మరోవైపు గ్లామర్ మెరుపులతో కుర్ర గుండెల్లో గంటలు మోగిస్తోంది. తాజాగా పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి. 

స్వెట్ షెటర్ ధరించిన కృతి శెట్టి గులాబీకి అందంగా  ముద్దుపెడుతూ కనిపించింది. మెరిసిపోతున్న చర్మసౌందర్యంతో చూపు తిప్పుకోనివ్వకుండా చేసింది. ఫొటోలను చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఒకే ఫ్రేమ్ లో రెండు గులాబీలను చూసినట్టుంది అంటూ పొగుడుతున్నారు. లైక్స్, కామెంట్లతో బ్యూటీఫుల్ పిక్స్ ను వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ అక్కినేని నాగచైతన్య సరసన ‘కస్టడీ’తోపాటు, మలయాళ చిత్రంలోనూ నటిస్తోంది. 
 

Latest Videos

click me!