అలా మణిరత్నం రూపొందించిన ‘యువ’లోనూ కీలక పాత్ర ధరించిన సిద్ధార్థ్ ను తెలుగు నిర్మాత ఎమ్మెస్ రాజు తన ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’తో తెలుగువారికి పరిచయం చేశారు. ఈ చిత్రంతోనే నటుడు, నృత్య దర్శకుడు ప్రభుదేవా దర్శకునిగా మారారు. ఈ సినిమా సాధించిన ఘనవిజయంతో సిద్ధార్థ్ కు తెలుగునాట విశేషాదరణ లభించింది.
“చుక్కల్లో చంద్రుడు, బొమ్మరిల్లు, ఆట, కొంచెం ఇష్టం-కొంచెం కష్టం, ఓయ్, అనగనగా ఓ ధీరుడు, బావ, ఓ మై ఫ్రెండ్, జబర్దస్త్” వంటి తెలుగు చిత్రాల్లో నటించిన సిద్ధార్థ్ ‘బాద్ షా’లో యన్టీఆర్ ఫ్రెండ్ గా కనిపించారు. నటునిగా, గాయకునిగా, నిర్మాతగా, రచయితగా తనలోని బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించారు.