Shilpa Shirodkar, Namrata Shirodkar, Mahesh babu
బిగ్‌బాస్ రియాలిటీ షో ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. ఈ షో ప్రేక్షకులకు ఎంటర్నైన్మెంట్ ని పంచితే, కంటెస్టెంట్లకు పాపులారిటీని తెచ్చిపెడుతోంది. అందుకే తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, మరాఠీ, హిందీ భాషల్లో బిగ్‌బాస్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.
ప్రస్తుతం తెలుగులో ఎనిమిదో సీజన్ నడుస్తుండగా హిందీలో 18వ సీజన్ అక్టోబర్ 6న ప్రారంభం అయ్యింది. ఈ సీజన్ లో మహేష్ భార్య నమ్రత కనిపించే అవకాశాలు ఉన్నాయంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..
Shilpa Shirodkar, Namrata Shirodkar, Mahesh babu
బిగ్ బాస్ షో లో నటి శిల్ప శిరోద్కర్ కూడా ఉండటం జరిగింది. ఈమె సూపర్‌స్టార్ మహేశ్‌బాబు భార్య నమ్రతకు సోదరి అన్న విషయం తెలిసిందే! ఈ సందర్భంగా శిల్పా తను బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టడం పట్ల మహేష్ బాబుతో పాటు తన ఫ్యామిలీ ఎలా స్పందించింది అనే విషయాన్ని వెల్లడించింది.
ఈ సందర్భంగా తనకు బిగ్ బాస్ షో అంటే చాలా ఇష్టమని, ఇది తన కల నెరవేరిన అద్భుతమైన క్షణం అంటూ సంతోషాన్ని వ్యక్తం చేసింది. అంతే కాకుండా తన ప్రయాణం పట్ల ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉందంటూ శిల్పా శిరోద్కర్ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది.
Renu Desai
ముఖ్యంగా తాను బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెడుతున్నాను అని తెలియగానే నమ్రత, మహేష్ బాబు చాలా సంతోషించారని, తన ప్రయాణం గురించి గర్వపడుతున్నారని చెప్పుకొచ్చింది.
'షో ద్వారా నేను వారిని గర్వపడేలా చేస్తాను' అని శిల్పా మాటిచ్చింది. దీంతో ఇప్పటి నుంచే మహేష్ అభిమానులు ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. అందులో భాగంగానే సోషల్ మీడియాలో #శిల్పా శిరోద్కర్ అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేసారు.
ఇదిలా ఉంటే శిల్పా తన సోదరి నమ్రతను చూడాలనే కోరిక వ్యక్తం చేసింది. కరణ్ వీర్ మెహ్రాతో శిల్పా మాట్లాడుతున్నప్పుడు ఈ విషయం షేర్ చేయటం జరిగింది. తాను బిగ్ బాస్ లో కి ప్రవేశించే ముందు తన చెల్లిని కలవలేదని చెప్పుకొచ్చింది.నమ్రత వేరే ఎంగేజ్మెంట్స్ తో బిజీగా ఉండటంతో ఆమె తనకు బిగ్ బాస్ కు వెళ్తూంటే వీడ్కోలు చెప్పటం కుదరలేదని అందుకే ఇప్పుడు తన చెల్లిని చూడాలని ఉందని అంది.
తాను బిగ్ బాస్ ఫ్యామిలీ వీక్ లో నమ్రతను కలవాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. ఆమె అభిమానులు సైతం ఇదే విషయాన్ని ట్రెండ్ చేస్తున్నారు. ఫ్యామిలీని కలవాలని ఎవరికైనా ఉంటుందని, శిల్పా కోరికలో తప్పు లేదని అంటున్నారు. ఈ నేపధ్యంలో నమ్రత కూడా షోకు ఫ్యామిలీ వీక్ లో వెళ్లే అవకాసం ఉందంటున్నారు. అయితే ఈ విషయమై అధికారిక సమాచారం అయితే ఏమీ లేదు.
ఇక భ్రష్టాచార్(1989) సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన శిల్ప.. కిషన్ కన్హయ్య, త్రినేత్ర, హమ్, ఖుదా గవా, ఆంఖెన్, గోపి కిషన్, మృత్యునాద్, బేవఫ సనం ఇలా ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. అయితే ఆ తర్వాత ఆమె వివాహానంతరం సినిమాలు చేసింది తక్కువ.
శిల్ప శిరోద్కర్ తెలుగులో బ్రహ్మ మూవీలో యాక్ట్ చేసింది. పెళ్లి తర్వాత సినిమాలకు చెక్ పెట్టేసిన ఆమె పదేళ్ల గ్యాప్ తర్వాత 2013లో మళ్లీ సీరియల్స్‌లో కనిపించింది. ఇప్పుడు బుల్లితెరకు సైతం దూరంగా ఉంటున్న శిల్ప.. బిగ్‌బాస్ షోలో అడుగుపెట్టి దుమ్ము దులుపుతోంది. ఆమె ఎపిసోడ్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.