అడివి శేష్ పెళ్ళైన నటితో ఎఫైర్ కోసం ట్రై చేశాడా ? ఓపెన్ గా చెప్పేసింది, సీనియర్ హీరోయిన్ కి మెసేజ్ పెట్టాడట

First Published | Nov 2, 2024, 1:48 PM IST

పంజా, బాహుబలి, బలుపు లాంటి చిత్రాల్లో శేష్ నెగిటివ్ రోల్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ చిత్రాలతో అడివి శేష్ కి ఆడియన్స్ లో కొంత గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత క్షణం చిత్రంతో హీరోగా కెరీర్ ప్రారంభించాడు. ఇప్పటి వరకు 6 చిత్రాల్లో శేష్ హీరోగా నటించాడు.

టాలీవుడ్ లో ట్యాలెంటెడ్ యంగ్ హీరోల్లో అడివి శేష్ ఒకరు. బిగినింగ్ లో గుర్తింపు కోసం శేష్ నెగిటివ్ రోల్స్ లో నటించాడు. పంజా, బాహుబలి, బలుపు లాంటి చిత్రాల్లో శేష్ నెగిటివ్ రోల్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ చిత్రాలతో అడివి శేష్ కి ఆడియన్స్ లో కొంత గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత క్షణం చిత్రంతో హీరోగా కెరీర్ ప్రారంభించాడు. ఇప్పటి వరకు 6 చిత్రాల్లో శేష్ హీరోగా నటించాడు. ఆ 6 చిత్రాలు సూపర్ హిట్స్ అయ్యాయి. 

క్షణం, అమీతుమీ, గూఢచారి, ఎవరు, మేజర్, హిట్ 2 చిత్రాలతో శేష్ సూపర్ హిట్స్ అందుకున్నారు. ప్రస్తుతం శేష్ గూఢచారి 2లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా శేష్ పై గతంలో క్రేజీ యాంకర్ అనసూయ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తనతో శేష్ ఎఫైర్ పెట్టుకోవడానికి ప్రయత్నించాడు అనే అర్థం వచ్చేలా అనసూయ సంచలన వ్యాఖ్యలు చేసింది. 


అసలేం జరిగిందో వివరాల్లో తెలుసుకుందాం.. క్షణం చిత్రం కోసం విలన్ పాత్రకి సరిపడే నటిని అడివి శేష్ వెతుకుతున్నారు. విలన్ అయినప్పటికీ అందంగా స్టైలిష్ గా కనిపించాలి. అలాంటి పాత్రకి సీనియర్ హీరోయిన్ టబు సెట్ అవుతారు అని శేష్ భావించారట. ఆమెని అప్రోచ్ కావడం ఎలాగో తెలియదు. దీనితో ఆమె నంబర్ తెలుసుకుని శేష్ మెసేజ్ పెట్టారు. అప్పటికి శేష్ అంత పాపులర్ కాదు. దీనితో టబు కనీసం రిప్లై కూడా ఇవ్వలేదట. ఇక చేసేది లేక అడివి శేష్ కొత్త వాళ్ళని ట్రై చేస్తే బెటర్ అని డిసైడ్ అయ్యారట. 

టివిలో అనసూయని చూసి ఆమె కోపంగా, అందంగా కనిపించడం శేష్ కి నచ్చిందట. అప్పటి నుంచి అనసూయని అప్రోచ్ అవ్వాలని ట్రై చేశాడు. అనసూయ దేవిశ్రీప్రసాద్ తో కలసి యుఎస్ హోమ్ టూర్ చేసింది. ఆ టైంలో అడివి శేష్ అనసూయని కలవడానికి చాలా ట్రై చేశాడు. కానీ అనసూయ అతడిని అవాయిడ్ చేస్తూ వచ్చిందట. 

Also Read: ఆ ముగ్గురూ కాదు, చిరంజీవి నెంబర్ 1 అని డిసైడ్ చేసిన డైరెక్టర్..ఎన్టీఆర్, ఏఎన్నార్ ఎలా తిట్టారో తెలుసా

కుర్ర హీరోలు చాలా మంది తనకి లైన్ వేయడానికి ట్రై చేస్తున్నారని.. అడవి శేష్ కూడా అలాంటి వాడే అనుకుని అనసూయ అతడికి దూరంగా ఉండడానికి ట్రై చేసిందట. ఈ విషయాన్ని అనసూయ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. శేష్ నాకు లైన్ వేయడానికి వస్తున్నాడు అని అనుకున్నా. అందుకే అతడిని కలవలేదు. ఒకరోజు అనుకోకుండా కాఫీ షాప్ లో కలిశాడు. అప్పుడు తెలిసింది శేష్ అలాంటివాడు కాదు.. నాతో సినిమా చేయడానికి వచ్చాడు అని తెలిసింది. ఆ విధంగా తనకి క్షణం చిత్రంలో ఛాన్స్ వచ్చినట్లు అనసూయ తెలిపింది. ఒక వేల ఆ పాత్రకి టబు ఫిక్స్ అయి ఉంటే అనసూయ పరిస్థితి ఏంటో మరి. 

Latest Videos

click me!