Ennenno janmala bhandam: ఖుషి కోసం అభిమన్యు కాళ్ళు పట్టుకున్న యశోదర్.. కోపంతో రగిలిపోతున్న వేద!

Navya G   | Asianet News
Published : Feb 10, 2022, 02:12 PM IST

Ennenno janmala bhandam: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం (Ennenno janmala bhandam) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం..

PREV
16
Ennenno janmala bhandam: ఖుషి కోసం అభిమన్యు కాళ్ళు పట్టుకున్న యశోదర్.. కోపంతో రగిలిపోతున్న వేద!

ఈరోజు ఎపిసోడ్ లో... ముహూర్తానికి లేట్ అవుతున్నప్పటికీ యశోదర్ ఇంకా మండపానికి రాడు. దాంతో వేద..నా గురించి నా ఫ్యామిలీ గురించి యశోదర్ (Yasodhar)  ఏదైనా పగ పెంచుకున్నాడా అని ఆలోచిస్తూ ఉంటుంది.
 

26

ఇక పెళ్లికి వచ్చిన వాళ్ళు వేద గురించి నానారకాలుగా చెవులు కోరుకుంటారు. ఇక దాంతో సులోచన  (Sulochana) కోపంగా మాలిని పై విరుచుకు పడుతుంది. నీ వల్లే మా కుటుంబం పరువు నాశనం అయింది అంటూ వాళ్ళని కోపంగా అరుస్తుంది. ఒకవైపు వేద.. 'మిస్టర్ యోశోధర్ (Yasodhar)  నువ్వు ఇంత కసాయివాడి అని అనుకోలేదు.
 

36

నువ్వు కలలో కూడా ఊహించని గుణపాఠం ఈరోజు నేను నీకు నేర్పిస్తాను' అని మనసులో అనుకుంటుంది. మరోవైపు యశోదర్ (Yasodhar) వెల్లి ఖుషి ను కలుసుకుంటాడు. ఇక వేద యశోధర దగ్గరికి బయలు దేరుతుంది. ఆ క్రమంలోనే మాళవిక కూడా ఆ పెళ్ళికి వస్తుంది. మరోవైపు అభిమన్యు (abhimanyu) , ఖుషి ని పెళ్లి కి పంపించడం కుదరదు అని యశోధర్ తో అంటాడు.
 

46

మరోవైపు యశోధర (Yasodhar) దగ్గరకు బయలుదేరిన వేదను వాళ్ల బావ కన్విన్స్ చేసి అక్కడే ఉండేలా చేస్తాడు. ఇక వాళ్ళిద్దరూ  అక్కడ నవ్వుకుంటూ..  సెల్ఫీ దిగుతూ ఉండగా వాళ్లను చూసి మాళవిక తనే కాబోయే భర్త ఏమో యశోదర్ కాదేమో అని మనసులో అనుకుంటుంది. మరోవైపు యశోదర్, అభిమన్యు (Abhimanyu)  కి పాపని పంపించమని చేతులెత్తి దండం పెడతాడు.
 

56

అదే క్రమంలో యశోదర్ (Yasodar)  తన కాళ్లు పట్టుకుంటాడు. కానీ అభిమన్యు పొగరుగా పలు మాటలు అంటూ యశోదర్ చొక్కా కాలర్ ను పట్టుకుంటాడు. అభిమన్యు మాటలకు అసహనం వ్యక్తం  చేసిన యశోదర్, అభిమన్యు చొక్కాను కోపంగా పట్టుకొని వా ర్నింగ్ ఇస్తాడు. దాంతో అభిమన్యు (Abhimanyu) సెక్యూరిటీతో యశోదర్ ను బయటకు పంపించేస్తాడు.
 

66

ఇక యశోదర్  బాధపడుతూ (Yasodhar) పెళ్లి మండపానికి రాగా వేద కోపంగా యశోధర ను ఎక్కడికో తీసుకు వెళుతుంది. ఆ తరువాత  వారిరువురూ పెళ్లి పీఠలపై ఉండగా వారిద్దరి వెనుకకు ఖుషి వస్తుంది. ఇక పెళ్లి కి ఖుషి (Khusi) ఎలా వచ్చిందో తెలియాలి అంటే  రేపటి భాగం కోసం ఎదురు చూడాల్సిందే.

click me!

Recommended Stories