Mahaan:విక్రమ్ ‘మహాన్’సినిమా రివ్యూ

Surya Prakash   | Asianet News
Published : Feb 10, 2022, 02:07 PM IST

ఈ మధ్య కాలంలో   విక్రమ్ నటించిన సినిమాలు కొన్ని బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయి వుండొచ్చుకానీ, నటుడిగా ఆయన ఏ సినిమాతోనూ ఫెయిల్ కాలేదన్నది నిజం.  మరి, అలాంటి విక్రమ్.. తన కుమారుడు ధృవ్‌తో (Dhruv Vikram) కలిసి చేసిన ‘మహాన్’ సినిమాపై అంచనాలు ఏర్పడకుంటా వుంటాయా.?

PREV
19
Mahaan:విక్రమ్ ‘మహాన్’సినిమా రివ్యూ

 

కొన్ని కాంబినేషన్స్ ఇంట్రస్టింగ్ గా ఉంటాయి. ముఖ్యంగా తెరపై తండ్రి ,కొడుకులు నటిస్తున్నారంటే అభిమానులు ఆనందపడతారు. మిగతావాళ్లు ఆసక్తిగా చూస్తారు. మొన్నీ మధ్యే తెలుగులో బంగార్రాజు తో ఇదే తండ్రి ,కొడుకు స్కీమ్ తో వచ్చారు. ఇప్పుడు విక్రమ్ తన కొడుకుని వెంటనేసుకుని వచ్చారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఇద్దరికి చెప్పుకోదగ్గ క్రేజ్ లేదు. ఒకరికొకరు అండగా ఉండి హిట్ ని తమ దాకా లాక్కెళ్లదామనే ప్రయత్నంలో భాగంగా వచ్చిన చిత్రం ఇది. ఇంకా చెప్పుకోలంటే విక్రమ్ ఇమేజ్ ని తన కొడుక్కి ట్రాన్సఫర్ చేసే ప్రాసెస్ ఇది. అయితే అందులో విక్రమ్ ఎంతవరకూ సక్సెస్ అయ్యాడో చూద్దాం.

29
mahaan audience review


 గాంధీమహాన్‌ (విక్రమ్‌) ఫ్యామిలీ తరతరాలుగా మధ్యపాన నిషేధానికి కట్టుబడి ఉంటుంది..పోరాటం చేస్తుంది. కామర్స్ లెక్చరర్ గా సెటిలైన మహాన్ ... తను పద్దతిగా గడుపుతున్న  జీవితం బోర్ కొడుతుంది.  తనకు నచ్చినట్లు బ్రతకాలానే ఆలోచన వస్తుంది. భార్య-కొడుకు ఇంట్లో లేని టైంలో ఒక రోజు తనకు నచ్చినట్లుగా బ్రతికే ప్రయత్నం చేస్తాడు. తన ప్రెండ్స్ తో మందు కొట్టి జల్సా చేస్తాడు. దాంతో  తర్వాతి రోజు ఇంటికి తిరిగొచ్చిన భార్య  నాచి (సిమ్రన్‌)కు దొరికిపోతాడు. ఆమెకు కోపం వచ్చి కొడుకుని తీసుకుని వెళ్లిపోతుంది. దాంతో సాఫీగా జరుగుతున్న మహాన్  జీవితంలో కల్లోలం రేగుతుంది. అందరూ ఉండి ఒంటరివాడవుతాడు.

 

39
mahaan drops tonight

అంతే అతను మధ్యం వైపుగా ప్రయాణం పెట్టుకుంటాడు.  సత్యవాన్ (బాబీ సింహా)తో కలిసి మధ్యం సిండికేట్ లో ప్రవేశించి లీడర్ గా ఎదుగుతాడు.  అప్పుడు దాదాబాయ్‌ నౌరోజీ(ధ్రువ్‌ విక్రమ్‌) అనే పోలీస్ అధికారి సీన్ లోకి వస్తాడు. అతని పనులకు అడ్డుపడతాడు. సిండికేట్ ని క్లోజ్ చేస్తానంటాడు. మహాన్ స్నేహితుడు సత్యవాన్ ని వదిలిపెట్టనంటాడు. దాంతో మహాన్ కు థ్రెట్ ఏర్పడుతుంది. అసలు ఎవరీ నౌరోజీ. మహాన్ మారి..తిరిగి తన పాత జీవితంలోకి వచ్చాడా..నౌరోజీ, మహాన్ ల మధ్య పోరాటంలో ఎవరు గెలిచారు..చివరకు ఏమైందనేది మిగతా కథ.

49
mahaan song


కథగా చూస్తే ‘మహాన్’.. ఓ సాదా సీదా రొటీన్ కథే.  మనకు చాలా  పాత సినిమాల్లో తండ్రి చాలా నిజాయితీ పరుడు, కొడుకు కేటుగాడు, దొంగ అవుతాడు. ఇద్దరి మధ్యా పోలీస్ ,దొంగ ఆట నడుస్తుంది. కొడుకుని రక్త సంభంధం కూడా ప్రక్కన పెట్టి చట్టానికి పట్టిస్తాననే తండ్రి కనపడతారు. అతనే హీరోగా కథ నడుస్తూంటుంది. అప్పట్లో కొండవీటి సింహ నుంచి  ఆ మధ్యన వచ్చిన భారతీయుడు దాకా అదే స్కీమ్ ..స్కూల్. అయితే ఇందులో ఆ స్కీమ్ రివర్స్ గేర్ లో నడుస్తుంది. తండ్రి దుర్మార్గుడు. కొడుకు పోలీస్ అధికారి అవుతాడు. తండ్రి దుర్మార్గులను ఆపుతానని సపధం చేసి రంగం లోకి దిగుతాడు కొడుకు. అలా చూస్తే ఓ రకంగా కొడుకు కథ. కానీ ఇది విక్రమ్ హీరో గా ఉన్నప్పుడు విక్రమ్ కథే అవుతుంది. ఆ పాయింటాఫ్ వ్యూలోనే మనం చూస్తాము. ఆ విషయం దర్శకుడు మర్చిపోయాడు. దానికి తోడు ఈ కథని చాలా ప్లాట్ నేరేషన్ లో స్లో గా నడుపుతాడు.  

 

59
mahaan trailer


చాలా డల్ గా మొదలయ్యే ఈ సినిమా ఎంతసేపటికీ ముందుకు ఓ అడుగు వేయదు. సీన్స్ నడిచిపోతూంటాయి కానీ విషయం కనపడక గొంతు దిగని కషాయంలా మారుతుంది. దానికి తోడు సినిమాలో మెయిన్ కాంప్లిక్ట్ అయిన తండ్రి,కొడుకుల సవాల్ ...ఎన్నో సార్లు చూసిందే. గాంధేయవాదం-ఎక్స్ ట్రిమిస్ట్ ఒకే వ్యక్తిలో  ఎలా ఉంటుందనే పాయింట్ తో మహాన్ పాత్రను డిజైన్ చేసారు. అది థీరీగా చెప్పటానికి బాగుందేమో కానీ తెరపైకి వచ్చేసరికి క్లారిటీ లేకుండా పోయింది. విక్రమ్ పాత్ర తన ఇంట్రనల్ కాంప్లిక్ట్స్ తో పోరాటమా లేక తన కొడుకు అయిన ఎక్స్ట్రనల్ పాత్రలో సంఘర్షణో తేల్చుకోలేకపోయింది. దాంతో సినిమా సినిమాలో క్లారిటీ మిస్సైంది. సినిమా ఫస్టాఫ్ మొత్తం సాగతీతలా మారింది.  సెకండాఫ్ లో తండ్రీకొడుకుల నడుమ సంఘర్షణను పీక్స్ కు  తీసుకెళ్లినప్పటికీ.. కథలో మేజర్ ట్విస్ట్స్ ను రివీల్ చేసి, డీల్ చేసిన విధానం విసుగెత్తిస్తుంది. డైరక్టర్ తండ్రి,కొడుకుల  మధ్యా ఆధిపత్య పోరుని హైలెట్ చేద్దామనుకున్నాడు కానీ డ్రామా పండక పోవటంతో ఫలితం లేకుండాపోయింది.

 

69


విక్రమ్ టోటల్ కథ చూడకుండా తన పాత్ర, తన కొడుకు పాత్ర మాత్రమే చూసుకున్నాడనిపిస్తుంది. తన కొడుకుని హీరో చేయటానికి తను విలన్ వేషం ఎత్తాడు. ఇద్దరూ పోటీపడి నటించారు. అయితే డైరక్టరే వీళ్లద్దరికీ అన్యాయం చేసాడు.  ఈ ఇద్దరి మధ్యా మైండ్ గేమ్ మరింత పవర్ ప్యాక్డ్‌గా డిజైన్ చేయలేకపోయాడు.

 సిమ్రాన్ విషయానికి వస్తే కాస్త ఓవరేక్షనే అనిపించింది. అలాగే కథలోకూడా ఆ పాత్రకు ప్రయారిటీ,లాజిక్ పెద్దగా ఉండదు. ఇక బాబీ సింహా ఈ సినిమాకి స్పెషల్ ఎట్రాక్షన్. చాలా సహజంగా వుంటుంది అతని నటన.

 

79


ప్రెండ్షిప్, పాలిటిక్స్, వైవాహిక బంధం.. ఇలా  కథలో చాలానే వున్నాయ్. అయితే ఏదీ సరిగ్గా ఎస్టాబ్లిష్ కాలేదు. ‘లిక్కర్ మాఫియా’ని ఇంకాస్త ఎఫెక్టివ్‌గా చూపించి వుంటే ఖచ్చితంగా బాగుండేది.. అనిపిస్తుంది.  విక్రమ్ – ధృవ్ మధ్య నడిచే యాక్షన్ సీన్స్ మాత్రం బాగున్నాయి. కార్తీక్ సుబ్బరాజు స్క్రీన్ ప్లే....స్క్రిప్టుపై మరింత పట్టు చూపించి ఉంటే చాలా సీన్స్ పండేవి.

ఇక మిగతా క్రాప్ట్ ల విషయానికి వస్తే..సంతోష్‌ నారాయణ్‌ ఎప్పటిలా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరకొట్టాడు.  ఎడిటర్‌ వివేక్‌ హర్షన్‌ మాత్రం చూసేవాళ్ల సహనానికి పరీక్ష పెట్టాడు. కెమెరా వర్క్ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ ..కాస్త గట్టిగానే ఖర్చు పెట్టారు.

 

89
mahaan song


తండ్రి,కొడుకుల కథ అంటే తెరపైనా తండ్రి,కొడుకుల గా చెయ్యక్కర్లేదేమో...

Rating: 2

---సూర్య ప్రకాష్ జోష్యుల

 

99


నిర్మాణ సంస్థ: సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియో;
 నటీనటులు: విక్రమ్‌, ధ్రువ్‌ విక్రమ్‌, సిమ్రన్‌, బాబీ సింహా, వాణీ భోజన్‌, తదితరులు;
సంగీతం: సంతోషన్‌ నారాయణన్‌;
ఎడిటింగ్‌: వివేక్‌ హర్షన్‌;
 సినిమాటోగ్రఫీ: శ్రేయస్‌ కృష్ణ;
కథ, కథనం, దర్శకత్వం: కార్తిక్‌ సుబ్బరాజ్‌;
 నిర్మాత: లలిత్‌కుమార్‌;
 విడుదల తేదీ: 10-2-2021;
స్ట్రీమింగ్‌: అమెజాన్‌ ప్రైమ్‌.

 

click me!

Recommended Stories