తమిళంతో పాటు తెలుగు, మలయాళం సినిమాల్లో నటించిన మనోబాలా, 2014లో విడుదలై మంచి విజయం సాధించిన "సతురంగ వేటై" సినిమాతో నిర్మాతగా మారారు. ఆ సినిమాకు హెచ్. వినోద్ దర్శకత్వం వహించారు. అది ఆయన తొలి సినిమా. ఆ తర్వాత 2017లో బాబీ సింహా, కీర్తి సురేష్ నటించిన "పాంబు శట్టై" సినిమాను కూడా మనోబాలా నిర్మించారు.
సహాయ దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన మనోబాలా 2023 మే 3న చెన్నైలో అనారోగ్యంతో మరణించారు. ఆయన మరణం తర్వాత "తీరా కాదల్", "కాసేతాన్ కడవులడా", "రాయర్ పరంపర" నుంచి ఈ ఏడాది విడుదలైన "ఇండియన్ 2", "అంధగాన్" వరకు 20 సినిమాలు విడుదలయ్యాయి.