బిగ్ బాస్ తెలుగు 8 మూడో వారం నామినేషన్ ముగిసింది. ఈ వారం యష్మి, మణికంఠ, అభయ్, పృథ్వీరాజ్, కిర్రాక్ సీత, నైనిక, విష్ణు ప్రియా, ప్రేరణ నామినేట్ అయ్యారు. నామినేషన్ ప్రక్రియలో యష్మి, మణికంఠ మధ్య గట్టిగా గొడవ జరిగింది. యష్మి తప్పులను ఎత్తిచూపించినందుకు తట్టుకోలేకపోయింది.
మణికంఠపై పగ పట్టింది. తాను హౌజ్ లో ఉన్నంత కాలం అతన్ని నామినేట్ చేస్తానని వెల్లడించింది. యష్మి ఇంత కాలం నామినేషన్‌లో లేదు. చీఫ్ అయిన కారణంగా ఆమె దూరంగా ఉంటూ వచ్చింది. పైగా నామినేట్ చేసే విషయంలోనూ ఆమె పెద్దగా వాగ్వాదానికి దిగింది లేదు. దీంతో పెద్దగా ఎలివేట్ కాలేదు.