Mahesh Babu, marriage, Namrata
టాలీవుడ్‌లో మోస్ట్ లవబుల్ అండ్ బెస్ట్ కపుల్ అంటే సూపర్‌స్టార్ మహేశ్ బాబు- నమ్రత శిరోద్కర్ దంపతుల పేరే చెప్తారు. మహేశ్-నమ్రతలది లవ్ మ్యారేజి. 2000 సంవత్సరంలో బీ.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన 'వంశీ' సినిమాలో వీరిద్దరు నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు.
అనంతరం 5ఏళ్ల పాటు డేటింగ్లో ఉన్నారు. ఆ తర్వాత ఇరువురి కుటుంబ సభ్యులను ఒప్పించి 2005 ఫిబ్రవరి 10న వివాహం చేసుకున్నారు. అయితే అప్పట్లో వీరి పెళ్లికి ఒకరు వాళ్ల ఫ్యామిలీలో ఇష్టపడలేదు. ఆ విషయం మహేష్ తండ్రి స్వర్గీయ కృష్ణగారు ఓ సారి ఇంటర్వూలో చెప్పుకొచ్చారు.
Mahesh Babu, marriage, Namrata
నమ్రత, మహేష్ ‘వంశీ’ (Vamsi) సినిమాలో వీరిద్దరూ జంటగా నటించారు. ఈ మూవీ షూటింగ్ దాదాపు నెల రోజుల పాటు న్యూజిలాండ్‌లో జరగింది. ఆ సమయంలో మహేష్ - నమ్రత మధ్య మంచి స్నేహం కుదిరింది. అనంతరం ఆ స్నేహం ప్రేమగా మారింది. సాధారణంగా సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు మీడియాకు లీకవుతుంటాయి.
కానీ మహేశ్-నమ్రత రిలేషన్‌షిప్ మాత్రం బయటకు రాకుండా మేనేజ్ చేసారు. దాదాపు ఐదేళ్లు ప్రేమని ఎంజాయ్ చేసిన ఈ జంట చివరికి ఇంట్లో చెప్పేశారు. ముందుగా వీరి ప్రేమ గురించి తెలుసుకున్న కృష్ణ , మహేశ్-నమ్రతల పెళ్లికి నో చెప్పారట. అయితే అప్పుడే సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు మహేశ్ సోదరి ఘట్టమనేని మంజుల. తమ్ముడి పెళ్లికి ఒప్పుకోవాలని తండ్రి కృష్ణను ఎలాగోలా ఒప్పించారట.
Mahesh Babu, marriage, Namrata
అయితే మహేష్ అమ్మమ్మగారైన దుర్గమ్మగారికి ఓ నార్త్ అమ్మాయి తమ కుటుంబంలోకి రావటం ఇష్టం లేదట. ఆమెకు కులం, మతం, ప్రాంతం వంటి పట్టింపులు ఎక్కువ. దాంతో మహేష్ వేరే ప్రాంతం, కులానికి చెందిన అమ్మాయిని వివాహం చేసుకుంటానంటే ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఆమెకు తెలుగు పరిశ్రమలోని ఓ స్టార్ హీరో కుమార్తెతో తన మనవడు వివాహం జరిపించాలనుకుందిట. దాంతో ఆమెకు చెప్పకుండానే, ఓ రకంగా తెలియకుండానే వివాహం జరిపించాల్సి వచ్చిందిట.
Mahesh Babu, marriage, Namrata
ఈ విషయాన్ని సూపర్ స్టార్ కృష్ణ చెప్తూ...తన పెళ్లి విషయమై మంజులను నా దగ్గరకు పంపాడు. నేను నమ్రతను పెళ్లి చేసుకోలాలనుకుంటన్నాను. నాన్నతో చెప్పి ఎలాగైనా ఒప్పించు అన్నాడు. వాళ్ల అమ్మమ్మ గొడవ చేస్తూ ఉండేది తెలుగు అమ్మాయినే చేసుకోవాలని. దాంతో ఇక్కడ పెళ్లి చేస్తే ఏమి గొడవ అవుతుందో అని ముంబైలో చేసుకోవాలనుకున్నారు. దాంతో నేను విజయ నిర్మల వెళ్లి మాట్లాడాము. అలాగే మా కుటుంబ సభ్యులు, మా సిస్టర్స్ ఇలా క్లోజ్ సర్కిల్స్ కొద్ది మందితో మహేష్ పెళ్లి జరిపించాం అన్నారు.
బిగ్ బాస్ హౌజ్ నుంచి మూడో వారం ఎగ్జిట్ అయ్యేది ఎవరు?
Mahesh Babu, marriage, Namrata
మహేష్ బాబు మాట్లాడుతూ...‘సినిమా చేస్తున్నప్పుడు మా మధ్య స్నేహం కుదిరింది. ఆ ప్రయాణంలోనే ఆ స్నేహం ప్రేమగా మారింది. నాలుగైదేళ్లకి నా కుటుంబానికి నా ప్రేమ విషయం చెప్పాను. తర్వాత అంత స్మూత్‌గా సాగిపోయింది. నాన్నకి నా మీద మొదటి నుంచి చాలా నమ్మకం. నేను మంచి నిర్ణయాలే తీసుకుంటానని ఆయనకి తెలుసు. అందుకే వెంటనే ఒప్పేసుకున్నారు’ అని మహేశ్ చెప్పుకొచ్చాడు.
Mahesh Babu, marriage, Namrata
వివాహానికి ముందు నమ్రత కూడా హీరోయిన్‌గా అనేక చిత్రాల్లో నటించింది. దీంతో పెళ్లి కన్నా ముందే ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పి హౌస్‌వైఫ్‌గా ఉండాలని నమ్రతను కోరారట మహేశ్. దీనికి అంగీకరించిన నమ్రత, పెళ్లిపీటలు ఎక్కటానికి ముందే అప్పటికే పెండింగ్‌లో ఉన్న సినిమాలను జెట్ స్పీడుతో పూర్తి చేసి మహేశ్‌తో మెడలో మూడు ముళ్లు వేయించుకున్నారు.
అలాగే తనకు రావాల్సిన భార్య విషయంలో మహేశ్ చాలా క్లారిటీతో ఉండేవారు. ఉద్యోగం చేయని అమ్మాయి జీవిత భాగస్వామిగా రావాలని కోరుకున్నారు. అప్పటికే ఇండస్ట్రీలో ఉన్న నన్ను సినిమాలు మానేయాలని అడిగారు. అలాగని నేను ఏదైనా ఆఫీస్‌లో పనిచేసినా సరే దానిని మానేసి ఇంట్లో చక్కగా పిల్లలను చూసుకొమని చెప్పారు. అలా పెళ్లి విషయంలో తన అభిప్రాయాన్ని పెళ్లికి ముందే తెలిపారు మహేశ్. ఇలా కొన్ని విషయాల్లో మేము ఒకరికొకరము త్యాగం చేసుకున్నాం' అని నమ్రత చెప్పుకొచ్చారు.
పెళ్లికు ముందు కృష్ణ ఒక కండీషన్ పెట్టారట. పెళ్లికి ముందు ఇద్దరూ స్టార్ స్టేటస్‌ను సంపాదించాలని కోరారట. ఆ తర్వాత ఏమైందో కానీ, తాను పెట్టిన షరతును వెనక్కి తీసుకొని హ్యాపీగా ఇద్దరికి పెళ్లి జరిపించి ఆశీర్వదించారు కృష్ణ. ఇక ఈ జంట ప్రేమ పెళ్లికి గుర్తుగా కుమారుడు గౌతమ్, కుమార్తె సితార జన్మించారు.
మహేశ్‌కు ఖాళీ దొరికితే సరదాగా టూర్స్ వేస్తుంటారు. షాపింగ్‌లు చేస్తాం. నచ్చింది తింటాం. కానీ మహేశ్‌ను వెంటేసుకుని షాపింగ్ చేయడం మాత్రం ఎప్పుడూ కుదరదు. ఆయన షాపింగ్ కూడా నేనే చేస్తా. నాకోసం ఆయన ఏ షాపింగ్ చేయడు. మహేశ్ నుంచి అలా ఎక్స్‌పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు అన్నారు నమ్రత.
2005 ఫిబ్రవరి 10న మహేష్- నమ్రత ఒక్కటయ్యారు. ఇక పెళ్లి అనంతరం నమ్రత సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. బాలీవుడ్‌లో వరుస ఆఫర్లు వస్తున్న సమయంలోనే యాక్టింగ్ కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పెట్టేసింది. ఇక సెలబ్రిటీల జీవితాల్లో ఎన్నో చిక్కులు, చికాకులు ఉంటాయని అంటుంటారు.. అయితే అలాంటి వాటికి ఈ జోడీ ఎంతో దూరం అని నిరూపించింది. అంతేకాకుండా సందర్భం వచ్చినప్పుడల్లా ఈ జంట ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమని వ్యక్తం పరుస్తూ ఉంటుంది. వీలు కుదిరినప్పుడల్లా మహేష్ కుటుంబంతో కలిసి టూర్స్ ఎంజాయ్ చేస్తుంటారు.
మహేశ్ కోసం నేను షాపింగ్ చేయాలి తప్ప.. ఆయన నాకోసం ఎప్పుడూ షాపింగ్ చేయడు అంటూ చమత్కరించారు నమ్రతా శిరోద్కర్. మంగళవారం హైదరాబాద్‌లో తన స్నేహితురాలు ప్రారంభించిన స్టైలింగ్ స్టోర్ ఓపెనింగ్ కు గెస్ట్ గా వచ్చిన నమ్రత తన వ్యక్తిగత విషయాలతోపాటు మహేశ్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
అయితే సూపర్ స్టార్ మహేష్ బిజీగా ఉంటే.. ఫ్యామిలీకి సంబంధించిన విషయాలన్నీ నమ్రతనే చూసుకుంటుంది. ఏది చేయాలి అన్నా.. ఆమె. మహేష్ కు సంబధింన విషయాలు కూడా ఆమె చూసుకుంటుంది. అంతే కాని మహేష్ తన కోసం ఏం చేయలేదంటోంది నమ్రత. అయితే తాను బిజీగా ఉండటం వల్లే అంటోంది మాజీ హీరోయిన్.