NTR and Suman
ఒకప్పుడు స్టార్ గా వెలిగిన సుమన్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయ్యాడు. ఆయన తరచుగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటారు. తాజా ఇంటర్వ్యూలో సుమన్ హీరో ఎన్టీఆర్ ని ఉద్దేశిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆయన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
సుమన్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ చాలా అదృష్టవంతుడు. దేవర విడుదలకు ముందే ఇన్ని రికార్డులు అంటే సామాన్యం కాదు. అది అందరు నటులకు సాధ్యం కాదు. దర్శకుడు కొరటాల శివతో పాటు దేవర మూవీ టీమ్ వలన కూడా ఇది సాకారం అయ్యింది. దేవరకు భారీ క్రేజ్ ఏర్పడింది.
ఎన్టీఆర్ బాల్యం నుండే క్లాసికల్ డాన్సర్. అందుకే ఆయన ఏ డాన్స్ వేసినా గ్రేస్ ఉంటుంది. అలాగే డైలాగ్స్ చెప్పడంలో చిన్నప్పటి నుండే అలవాటు ఉంది. అందులో ఆయన మాస్టర్. డాన్సుసుల పై కూడా పట్టు ఉంది. సిల్వర్ స్క్రీన్ పై నటులు ఎలా కనిపించాలో ఎన్టీఆర్ కి అవగాహన ఉంది.
అంకితభావం, నిబద్ధత కలిగిన నటుడు. సెట్స్ లో అందరితో స్నేహపూర్వకంగా ఉంటాడు. ప్రతి సన్నివేశాన్ని టీం తో చర్చిస్తారు. సలహాలు, సూచనలు ఇస్తారు. ఆయనతో మరోసారి కలిసి నటించాలని కోరుకుంటున్నాను. దేవరపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా.. అని అన్నారు.
నా అల్లుడు మూవీలో సుమన్ ఎన్టీఆర్ కి మేనమామ పాత్ర చేశాడు. అలాగే దమ్ము చిత్రంలో ఎన్టీఆర్ తండ్రి పాత్ర చేశారు. అవకాశం వస్తే ఎన్టీఆర్ సినిమాలో నటించేందుకు సిద్ధమని సుమన్ తన మనసులో కోరిక బయటపెట్టాడు.
దేవర సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. ఐదు భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా అందుబాటులోకి రానుంది. దేవర చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. దేవర ట్రైలర్ ఆకట్టుకుంది.
దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో దేవర తెరకెక్కించారు. సైఫ్ అలీ ఖాన్ ప్రధాన విలన్ రోల్ చేశారు. దేవర రెండు భాగాలుగా విడుదల కానుంది. దేవర ట్రైలర్ రికార్డు స్థాయిలో వ్యూస్ రాబట్టింది. ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుండి వస్తున్న మూవీ కావడంతో అంచనాలు పెరిగాయి.
అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించారు. సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మరోవైపు నందమూరి ఫ్యాన్స్ లోని ఓ వర్గం దేవరను టార్గెట్ చేశారు. ట్రైలర్ పై నెగిటివ్ ప్రచారం చేశారు. దేవర చిత్రాన్ని తొక్కేసే ఆలోచనలో ఉన్నారు.
కొన్నాళ్లుగా బాలయ్య-ఎన్టీఆర్ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ చంద్రబాబు అరెస్ట్ పై మాట్లాడలేదు. దీంతో టి టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్ ని విపరీతంగా ట్రోల్ చేశారు. అలాగే ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు, బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో ఎన్టీఆర్ పాల్గొనలేదు.
ఈ క్రమంలో నందమూరి ఫ్యాన్స్ లోని ఓ వర్గం ఎన్టీఆర్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పటి నందమూరి ఫ్యాన్స్ రెండు వర్గాలుగా విడిపోయారు. ఈ క్రమంలో దేవర విజయం ఎన్టీఆర్ కి ప్రతిష్టాత్మకంగా మారింది. ఇక ఏమవుతుందో చూడాలి.
బిగ్ బాస్ హౌజ్ నుంచి మూడో వారం ఎగ్జిట్ అయ్యేది ఎవరు?