అప్పుడు వేదని దగ్గరికి తీసుకొని రేయ్ నా దేవతరా నా వేద. నా కోసమే పుట్టిన నా దేవతరా వేద అని అనడంతో వేద ఎమోషనల్ అవుతుంది. ఆ తరువాత వేద,యష్ ఇద్దరు కన్నీళ్లు పెట్టుకుంటారు. అప్పుడు మాళవిక వచ్చి లాయర్ దగ్గరికి వెళ్దాం పద అని అనగా గెట్ లాస్ట్ అని గట్టిగా అరుస్తాడు. అసలు నీ వల్లే ఇదంతా జరిగింది. నీ వల్ల ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపాను. నా జీవిత్తో అయిపోవడానికి కారణం నువ్వే అని అందరి ముందు మాళవికపై సిరీయస్ అవుతాడు యష్. ఆ తరువాత యష్ వేద ని కారులో పిలుచుకొని వెళ్తాడు. అప్పుడు ఎందుకు వేద నన్ను ఆపావు అలాంటి వాడు ఉంటే ఎంత పోతే ఎంత అని అంటాడు యష్.