రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న 'టాక్సిక్' సినిమా టీజర్ వచ్చేసింది. మార్చి 19న ఈ సినిమా రిలీజ్ కానుండటంతో అంచనాలు పెరిగిపోయాయి. టీజర్‌లో యష్ ను చూసిన అభిమానులు షాక్ అవుతున్నారు. ఇంతకీ అందులో ఏముంది?
కేజీఎఫ్ చేసిన చాలా కాలం తరువాత.. యష్ నటించిన మరో మూవీ ‘టాక్సిక్’ ఈ సినిమా టీజర్ తాజాగా రిలీజైంది. భారీ అంచనాల మధ్య మార్చి 19న ఈసినిమా విడుదల కానుంది. రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న ఈ పాన్-వరల్డ్ సినిమాకు గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు.
26
టీజర్ కు భారీ రెస్పాన్స్..
గతంలో వచ్చిన యశ్ క్యారెక్టర్ టీజర్ పెద్ద హిట్టయింది. ఆ టీజర్‌ను ఐదు భాషల్లో రిలీజ్ చేశారు. "అందరినీ ఎదిరించి బతకలేం" అనే డైలాగ్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచింది.
36
రచ్చ రచ్చ చేసిన రాకింగ్ స్టార్..
టీజర్‌లో "ఈసారి యుద్ధమే వేరు" అనే డైలాగ్ ఉంది. యశ్ ఇందులో వైలెంట్ కింగ్‌గా గర్జించాడు. 1 నిమిషం 55 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్, యశ్‌ను డ్యూయల్ షేడ్‌లో చూపిస్తూ ఆసక్తి రేపుతోంది.
ఈ టీజర్ మొత్తం యాక్షన్, ఫైట్స్, రక్తపాతంతో నిండిపోయింది. ఇది చూసి చాలామంది భయపడుతున్నారు కూడా. కొన్ని యాక్షన్ సీన్లు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. యష్ నటన అయితే అమేజింగ్.. అభిమానులు ఇది చూసి షాక్ అవుతున్నారు.
56
8 ఏళ్ల తరువాత యష్ విశ్వరూపం..
ఈ సినిమాలో యశ్ గడ్డం లేకుండా కనిపించాడు. 'KGF' సినిమా వచ్చి దాదాపు 8 ఏళ్లు అవుతోంది. అప్పటి నుంచి యశ్ గడ్డంతోనే ఉన్నాడు. ఇప్పుడు గడ్డం లేకుండా యశ్‌ను చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు.
66
విలన్ లుక్ లో యష్..
ఈ సినిమాలో యశ్ రావణుడి లాంటి లుక్‌లో కనిపించాడు. ఈ లుక్‌ను చాలామంది మెచ్చుకుంటున్నారు. టీజర్ రిలీజైన అరగంటలోనే మూడు వేలకు పైగా కామెంట్స్ వచ్చాయి.ఈ టీజర్‌లో యశ్ కొన్ని అసభ్య పదాలు వాడాడు. గత టీజర్‌లో కార్ ఛేజింగ్ సీన్ సంచలనం సృష్టిస్తే, ఈసారి యశ్ వాడిన భాష అందరినీ ఆశ్చర్యపరిచింది.