తాగి ఎలా పడిపోయిందో చూసావా.. అసలు బాధ్యత ఉందా, ఆడదేనా తను అంటూ అసహ్యించుకుంటాడు యష్. అమ్మ రాకపోతే నేను రాను అంటూ తండ్రి చేయి విడిపించుకుని తల్లి దగ్గరికి వెళ్లి ఏడుస్తాడు ఆదిత్య. ఎంతైనా తను ఒక ఆడపిల్ల.. తనని ఇలా వదిలేసి వెళ్ళిపోవటం కరెక్ట్ కాదు. ఆదిత్య మనతో రావాలంటే మనం మాళవిక ని తీసుకెళ్లి తీరాల్సిందే అంటూ భర్తని ఒప్పించి ఆదిత్యతోపాటు మాళవికని కూడా తీసుకువస్తుంది వేద.