లేటు వయసులో ఘాటు ప్రేమతో ఒక రేంజ్ లో వివాదం సృష్టించిన జంట నరేష్, పవిత్ర. ఎవరెన్ని విమర్శలు చేసినా తమ రిలేషన్ ని నరేష్, పవిత్ర ఇంకా బలపరుచుకుంటున్నారు. నరేష్ తన మూడవ భార్య రమ్య రఘుపతితో విడిపోయి.. పవిత్రతో సహజీవనం చేస్తున్నారు. అయితే వీరిద్దరూ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అనేది క్లారిటీ లేనప్పటికీ ప్రస్తుతానికి మాత్రం కలసి జీవిస్తూ ప్రేమలో మునిగితేలుతున్నారు.