ఎపిసోడ్ ప్రారంభంలో కారు బాగు చేస్తూ ఉంటాడు రిషి. అతనిని తదేకంగా చూస్తూ నువ్వు రిషి కదా అని అడుగుతుంది ఆ అమ్మాయి. నేను నీకు తెలుసా అని అడుగుతాడు రిషి. నేను ఏంజెల్ ని రిషి. మనం ఇంటర్మీడియట్లో ఫ్రెండ్స్, డిగ్రీలో కూడా కలిసి చదువుకున్నాము పక్క పక్కనే కూర్చునే వాళ్ళం గుర్తొచ్చిందా అంటుంది ఆ అమ్మాయి. గుర్తొచ్చింది అన్నట్లుగా తల ఊపుతాడు రిషి. ఉత్సాహంగా రిషి తో మాట్లాడుతుంది ఏంజెల్.