ఈరోజు ఎపిసోడ్ లో వేద,యష్ పార్టీలో ఇద్దరు ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ జ్యూస్ తాగుతూ ఉండగా ఇంతలోనే విన్నీ అక్కడికి వచ్చి మన కాలేజ్ మేట్ అర్చన నీకు గుర్తుందా తన వచ్చింది అనడంతో ఇప్పుడే వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వేద. మరోవైపు పార్టీలో అభి ఆల్కహాల్ సేవిస్తూ ఉండగా అప్పుడు యష్ కనిపించడంతో హలో మిస్టర్ యశోదర్ అని చెప్పి అక్కడికి వెళ్తాడు. నువ్వేంటి ఇక్కడ అనడంతో నేను విన్ని గెస్ట్ ని అనగా నేను ఈ పార్టీకి చీఫ్ గెస్ట్ ని అంటాడు అభి. అర్థం కాలేదు కదా నీకు రావాల్సిన ప్రాజెక్టు నాకు వచ్చింది కాదు వచ్చేలా చేసాడు విన్నీ అని అంటాడు అభి. మేమిద్దరము బిజినెస్ పార్ట్నర్స్ అయిన శుభ సందర్భంగా ఈ పార్టీ ఇస్తున్నాడు అని అంటాడు.