సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ ఎంత కూడబెట్టారో తెలుసా? వారి ఆస్తుల విలువ అన్ని కోట్లా!?

First Published | Feb 9, 2023, 12:40 PM IST

బాలీవుడ్ స్టార్స్ సిద్ధార్థ్ మల్హోత్ర - కియారా అద్వానీ పెళ్లి అనే పవిత్ర బంధంలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వీరి ఉమ్మడి ఆస్తుల విలువ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
 

బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్ర (Siddharth Malhotra) - స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ  (Kiara Advani) కొన్నాళ్లుగా డేటింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఎప్పుడెప్పుడు ఈ జంట ఒక్కటవుతుందా అని ఎదురుచూసిన అభిమానులకు రీసెంట్ గా గుడ్ న్యూస్ చెప్పారు. 
 

రెండ్రోజుల కింద పెళ్లిబంధంతో ఒక్కరయ్యారు ఈ స్టార్స్.  రాజస్థాన్ లోని జైసల్మేర్ లో గల సూర్యగఢ్ ప్యాలస్ లో మంగళవారం సాయంత్రం సిద్ధార్థ్, కియారా వివాహా వేడుక ఘనంగా జరిగింది. వీరి పెళ్లికి కుటుంబ సభ్యులు, సన్నిహితులతో  అతితక్కువ మంది అతిథులు మాత్రమే పెళ్లికి హాజరయ్యారు. 
 


ఇటు కియారా, అటు సిద్ధార్థ్ కూడా తమ పెళ్లిని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. తమకు అభిమానుల ఆశీస్సులు కావాలని కోరారు. తమ పెళ్లి ఫొటోలను పంచుకోవడంతో నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. వీరిద్దరికి అభిమానులు, నెటిజన్లు, సీనీ తారలు, ప్రముఖులు వివాహా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 
 

ఈ క్రమంలో సిద్ధార్థ్ మల్హోత్ర - కియారా అద్వానీకి సంబంధించిన ఉమ్మడి ఆస్తుల విలువపై ఎన్ని కోట్లనేది హాట్ టాపిక్ గా మారింది.  సిద్ధార్థ్, కియారా ఆస్తుల విలువ మొత్తం కలిపి రూ. 125 కోట్లకు పైగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇక ఇండస్ట్రీలో యంగ్ స్టార్స్ గానూ వీరిద్దరూ దూసుకెళ్తున్నారు.

బాలీవుడ్ లో సిద్ధార్థ్ మల్హోత్రాకు మంచి గుర్తింపు ఉంది. దీంతో ఒక్కో సినిమాకు రూ.8 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ ఒక్కో చిత్రానికి రూ.3 కోట్లు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారని తెలుస్తోంది. ఇక కియారాకు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. ఆయా నివేదికల ప్రకారం.. ఆమె కార్ల కలెక్షన్ లో కోటి రూపాయల విలువైన గొప్ప గొప్ప కార్లు ఉన్నాయని తెలుస్తోంది. 
 

రూ.1.56 కోట్ల విలువగల ఆడి A8L, మెర్సిడెస్ బెంజ్ ఇ క్లాజ్ రూ.72 లక్షలు, బీఎండబ్ల్యూ 530డీ రూ.68 లక్షలు, బీఎండబ్ల్యూ ఎక్స్5 ఎస్యూవీ రూ.98 లక్షలు విలువ గల లగ్జరీ కార్ల కలెక్షన్స్ కూడా ఉన్నాయంట. పెళ్లి తర్వాత కూడా కేరీర్ ను కొనసాగించనున్నారు. మున్ముందు భారీగా కూడబెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం కియారా ‘ఆర్సీ15’లో రామ్ చరణ్ సరసన నటిస్తున్నారు. 
 

Latest Videos

click me!