జిమ్‌లో శ్రమిస్తూ చెమటోడుస్తున్న సమంత.. వర్కౌట్‌ వీడియో షేర్‌.. మైండ్‌ బ్లోయింగ్‌ బౌన్స్ బ్యాక్‌..

Published : Feb 09, 2023, 12:23 PM IST

సమంత అనారోగ్యంతో పోరాడింది, లేచి నిలబడింది. తిరిగి మామూలు స్థితికి చేరుకుంటుంది. అంతేకాదు రెట్టింపు ఉత్సాహంతో బౌన్స్ బ్యాక్‌ అనేలా రాబోతుంది. అందుకు కఠోర శ్రమ చేస్తుంది. 

PREV
17
జిమ్‌లో శ్రమిస్తూ చెమటోడుస్తున్న సమంత.. వర్కౌట్‌ వీడియో షేర్‌.. మైండ్‌ బ్లోయింగ్‌ బౌన్స్ బ్యాక్‌..

సమంత తాజాగా జిమ్‌లో వర్కౌట్‌ చేస్తున్న వీడియో షేర్‌ చేసింది. ఇన్‌స్టా స్టోరీస్‌లో వీడియో పంచుకోగా అది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది. ఇందులో వర్కౌట్‌ లుక్‌లో అదరగొడుతుంది సమంత. కండలు తిరిగిన దేహంతో కనిపిస్తూ వాహ్‌ అనిపిస్తుంది. 

27

సీరియస్‌గా వర్కౌట్‌ చేస్తూ చెమటోడుస్తుంది సమంత. కోల్పోయిన ఫిట్‌నెస్‌ని తిరిగి పొందేందుకు, అనారోగ్యం నుంచి కోలుకునేందుకు కష్టపడుతుంది సమంత. వర్కౌట్‌ డ్రెస్‌ ధరించి మతిపోగొడుతుంది. బ్యాక్‌ సైడ్‌ నుంచి తీసిన వీడియోని పంచుకోగా అది ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది. 

37

చూడబోతుంటే సమంతలో కసి, ఆవేశం, సాధించాలనే తపన కనిపిస్తుంది. మునుపటి కంటే మరింత బలంగా తయారవుతుంది. అందుకు ఎంత కష్టమైన భరిస్తుంది. ఫిట్‌నెస్‌కి క్వీన్‌ అని నిరూపించుకుంటుంది. ఎంతో మందికి ఇన్‌స్పైరింగ్‌గా నిలుస్తుంది. 
 

47

ఇటీవల ఎక్కువగా జిమ్‌ ఫోటోలు, వీడియోలు పంచుకుంటుంది సమంత. తాను మరింత స్ట్రాంగ్‌గా సిద్ధమవుతున్నాననే సందేశాన్నిస్తుంది. అంతేకాదు ఆమె నటించే సినిమాల్లో యాక్షన్‌ కూడా చేయబోతున్న నేపథ్యంలో అన్ని రకంగాలుగా సంసిద్ధమవుతుంది. గతంలో సమంత `యశోద`, `ది ఫ్యామిలీ మ్యాన్‌ 2`లో యాక్షన్‌ చేసి అదరగొట్టిన విషయం తెలిసిందే. 

57

సమంత పడిలేచిన కెరటం. అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో ఆమె పని అయిపోయిందని అంతా భావించారు. కానీ ఆ బాధని సైలెంట్‌గా దిగమింగుకుంది. ఓ వైపు భర్త నాగచైతన్య విడాకులు ఇవ్వడం, ఆ తర్వాత అనారోగ్యానికి(మయోసైటిస్‌) గురి కావడంతో దెబ్బ మీద దెబ్బ పడ్డట్టు అయ్యింది. కష్టాలను ఓపికగా భారించింది. చివరి అంచు వరకు వెళ్లి తిరిగొచ్చింది. ఇప్పుడు మరోసారి వెండితెరపై మెస్మరైజ్‌ చేసేందుకు సిద్ధమవుతుంది. 
 

67

సమంత ఇటీవల `యశోద` చిత్రంలో నటించగా, ఇప్పుడు `శాకుంతలం`లో నటించింది. ఈ చిత్రం ఏప్రిల్‌లో విడుదల కాబోతున్నట్టు తెలుస్తుంది. ఫిబ్రవరి 17న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడిన విషయం తెలిసిందే. దీంతోపాటు ఆమె హిందీలో `సిటాడెల్‌` వెబ్‌ సిరీస్‌ రీమేక్‌లో నటిస్తుంది. 
 

77

మరోవైపు బాలీవుడ్‌లో మరో రెండు మూడు సినిమాలు చేయబోతుంది. తెలుగులో విజయ్‌ దేవరకొండతో `ఖుషి` సినిమా చేస్తుంది. ఇది సమంత అనారోగ్యం కారణంగా ఆగిపోయింది. త్వరలో ఈ చిత్ర షూటింగ్‌లో సమంత పాల్గొనబోతుంది. మార్చి మొదటి వారం నుంచి చిత్రీకరణ స్టార్ట్ చేయబోతున్నారు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories