ఈరోజు ఎపిసోడ్ లో వేద ఏవండోయ్ శ్రీవారు ఏమనుకుంటున్నారు నేను మీకు క్యారేజ్ తెస్తున్నాను అంటే మీ మీద నాకు ఏదో ప్రేమ పొంగి పోతుంది అనుకుంటున్నారేమో, తమకి అంత సీన్ లేదు మాస్టారు అని తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది వేద. అత్తయ్య గారు బాధపడుతున్నారని తీసుకెళ్తున్నాను తప్ప అంతకుమించి ఏమీ లేదు అని అనుకుంటూ ఉంటుంది వేద. మిమ్మల్ని చూడకుండా మీతో అస్సలు మాట్లాడకుండా ఉండాలి అనుకుంటాను కానీ మాట్లాడకుండా ఉండలేను అని అనుకుంటూ ఉంటుంది వేద. మరొకవైపు యష్ రోడ్డుపై వదిలేయడం గురించి నువ్వు మాట్లాడుతున్నావా అని కోపంగా అరుస్తాడు.