ఈరోజు ఎపిసోడ్ లో పనిమనిషి చికిత మీకోసం ఇన్ని చేసిన నేను నేను లేకుండా మీరు మీ చెంపలు వాయించుకుంటారా అని గాజులు సవరించుకుంటూ ఉంటుంది. అప్పుడు ఏంటే గాజులు సవరించుకుంటున్నావు అని మల్లిక అడగగా మీ చెంపలు వాయ కొడతాను అమ్మ అనడంతో మల్లిక షాక్ అవుతుంది. అప్పుడు పనిమనిషి అవునా అండి సరేలేండి తిందురాండి అని కామెడీగా పిలుస్తుంది. మరొకవైపు జానకి ప్రవర్తన గురించి ఆలోచిస్తూ ఉంటాడు రామచంద్ర. అప్పుడు జానకి పాలు తీసుకుని వచ్చి ఏవండీ రేపు టిఫిన్ ఏం చేయమంటారు అని ఏమీ తెలియనట్టుగా అడుగుతూ ఉంటుంది. అప్పుడు అది సరే కానీ ముందు నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పండి.