Ennenno Janmala Bandham: యష్, వేదల పెళ్లికి ఒప్పుకున్న సులోచన.. అసలు ట్విస్ట్ ఇచ్చిన మాలిని!

Navya G   | Asianet News
Published : Jan 31, 2022, 01:19 PM IST

Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం (Ennenno Janmala Bandham) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి కుటుంబ కథ నేపథ్యంలో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు సీరియల్ ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.

PREV
16
Ennenno Janmala Bandham: యష్, వేదల పెళ్లికి ఒప్పుకున్న సులోచన.. అసలు ట్విస్ట్ ఇచ్చిన మాలిని!

వేద (Vedha) మాళవిక వాళ్ళ ఇంటికి ఖుషి కోసం వెళ్తుంది. అక్కడ ఆయా ను చూసి వెళ్లి పలకరిస్తుంది. ఇక ఆయా ఖుషి పరిస్థితి బాగాలేదని ప్రస్తుతం తను గాజుముక్క లాంటిదని అంటుంది. ఖుషి (Khushi) ని తన తండ్రి నుంచి మరింత దూరం చేయడానికి అభిమన్యు, మాళవిక ప్రయత్నిస్తున్నారని అంటుంది.
 

26

మరోవైపు ఖుషి ఒంటరిగా కూర్చొని ఉంటుంది. వేద వెంటనే అక్కడికి వెళ్లి ఖుషి ను కాసేపు ఆట పట్టిస్తుంది.  నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళను అని ధైర్యం ఇస్తుంది.  ఈ విషయం గురించి వెంటనే యష్ (Yash) కు చెప్పాలని అనుకుంటుంది. మరోవైపు యష్ మాళవికకు ఫోన్ చేసి ఖుషి (Khushi) గొంతు వినాలని ఉందని అంటాడు.
 

36

కానీ మాళవిక (Malavika) యష్ పై అరుస్తుంది. పక్కనే ఉన్న అభిమన్యు కూడా రెచ్చగొట్టేలా మాట్లాడటం తో యష్ ఫోన్ ను కోపంగా విసరకొడతాడు. అప్పుడే వేద (Vedha) యష్ దగ్గరకు వచ్చి ఖుషి గురించి మాట్లాడుతుంది. తన పరిస్థితి బాలేదని అంటుంది. కనీసం ఇప్పుడైనా తన గురించి ఆలోచించు అని అంటుంది.
 

46

యష్ (Yash) కూడా తన గురించి ఆలోచిస్తున్నాను అంటూ అందుకే ఒక నిర్ణయం తీసుకున్నాను అని అంటాడు. ఖుషి కి అమ్మ కావాలి. నాన్న కావాలి. కాబట్టి మనం ఒకటవ్వాలని అని అంటాడు. దాంతో వేద కూడా సరే అంటుంది. మరోవైపు సులోచన (Sulochana), మాలిని ఒకరి ఇంట్లోకి ఒకరు తెగ చూపులు చూసుకుంటూ ఉంటారు.
 

56

ఇంట్లో వాళ్ళతో తమ భర్తలు తీసుకునే నిర్ణయం సరైనదని అనుకుంటారు. వెంటనే మాలిని (Maalini) రత్నం తో యష్ పెళ్లి గురించి మీరు తీసుకున్న నిర్ణయం సరైనది అనే సరికి రత్నం (Ratnam) సంతోష పడతాడు. అంతలోనే మాలిని మనం మగ పెళ్లి వాళ్ళమని వాళ్ళే వచ్చి అడగాలని ట్విస్ట్ ఇస్తుంది.
 

66

ఇక మరోవైపు యష్ (Yash), వేద రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరికి వెళ్తారు. అక్కడ వారి మధ్య కాసేపు కూల్ గొడవ జరుగుతుంది. తరువాయి భాగం లో యష్ బాగా తాగి మాళవిక (Malavika) దగ్గరికి వెళ్లి నీ కంటే బెటర్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నానని అంటాడు. ఇక యష్ తాగడంతో వేద యష్ పై కోపంగా రియాక్ట్ అవుతుంది.

click me!

Recommended Stories