Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు (Janaki Kalaganaledu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ మంచి ప్రేమ కథ నేపథ్యంలో ప్రసారమవుతుంది. ఇక ఈ రోజు ఈ సీరియల్ లో జరిగిన ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.
ఇక మల్లిక (Mallika) జ్ఞానాంబ ముందు జానకి ని ఇరికించే ప్రయత్నం చేస్తుంది. విలేకరులకు జానకి నే చెప్పింది అన్నట్లుగా మాట్లాడుతుంది. వెంటనే వెన్నెల మల్లిక తో జానకి (Janaki) గొప్పదనం గురించి, మనస్తత్వం గురించి చెబుతూ తాను అలాంటిది కాదు అని అంటుంది.
26
అఖిల్ (Akhil) కూడా వదిన అలాంటిది కాదు అని అంటాడు. దాంతో మల్లిక తిరిగి మళ్లీ వెటకారంగా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఓపిక నశించిన జానకి మల్లికను మాట్లాడొద్దు అని గట్టిగా హెచ్చరిస్తుంది. వెంటనే జ్ఞానాంబ (Jnanamba) మధ్యలో కలుగజేసుకుంటుంది.
36
తిరిగి జానకినే (Janaki) అంటుంది. పోలీస్ శాఖ అడిగినప్పుడు నీ నిర్ణయాన్ని అప్పుడే కాదని చెప్పకుండా తర్వాతకు సమాధానం ఎందుకు చెబుతాను అన్నావని ప్రశ్నిస్తుంది. అందుకే ఆ విలేకర్లకు అక్కడ ప్రశ్నించే అవకాశం వచ్చిందని అనటంతో మల్లిక (Mallika) మళ్ళీ మధ్యలో నిప్పులు చల్లుతూ ఉంటుంది.
46
జ్ఞానాంబ (Jnanamba) కూడా జానకి తన మాటలతో తన పరువు తీసే విధంగా మాట్లాడిందని అంటుంది. జానకి (Janaki) మాత్రం ఆ ఉద్దేశంతో అలా మాట్లాడలేదని.. ఎవరినీ నొప్పించకుండా మాత్రమే మాట్లాడానని అంటుంది. ఈ విషయంలో తనది ఎటువంటి తప్పు లేదని అర్థం చేసుకోండని అక్కడి నుంచి చెప్పి బాధతో వెళ్ళిపోతుంది.
56
ఇక మల్లిక (Mallika) లాయర్ కు ఫోన్ చేసి తన అత్తయ్య గారితో తనకు విడాకులు కావాలని అనటంతో వెంటనే ఆ లాయర్ తనకు వెటకారంగా సమాధానం ఇస్తాడు. ఇక విష్ణు వచ్చి తనను కాసేపు తిడతాడు. జానకి (Janaki) చదువుకుంటూ ఉండగా రామచంద్ర వచ్చి నువ్వు కావాలనుకున్న ఐపీఎస్ గురించి అమ్మకి చెప్పి ఒప్పించే ప్రయత్నం చేద్దాం అని అంటాడు.
66
ఒకవేళ తాను కాదు అన్న కూడా నేను వెనకాల ఉండి నడిపిస్తానని అంటాడు. దానికి జానకి సంతోషంగా ఫీల్ అవుతుంది. ఇక జ్ఞానంబ (Jnanamba) ఇంటికి జానకి అభినందించడానికి పోలీసులు వస్తారు. తరువాయి భాగం లో జానకి (Janaki) ఐపీఎస్ గురించి తన అమ్మ ముందు ధైర్యం చేసి మాట్లాడుతాడు రామచంద్ర.