మిత్రుడిని పట్టించుకోకూడదు కానీ శత్రువు కదలికలని పట్టించుకోవాలి ఫంక్షన్ లో పక్కనే ఉండే అడుగడుగునా వాడికి ఆనందం లేకుండా చేస్తాను అంటాడు అభి. పార్టీలో విన్ని యష్ ని విష్ చేస్తాడు కానీ యష్ అసలు కేర్ చేయడు. నువ్వు ఇలా బిహేవ్ చేయడంలో తప్పులేదు నా తప్పు కూడా ఉంది. వేదు లైఫ్ లోకి గెస్ట్ గా వచ్చాను గెస్ట్ గాని వెళ్ళిపోతాను వేదు ఎప్పటికీ నీదే అనుకుంటాడు విన్ని. మరోవైపు పార్టీలో విన్నీ, వేద కలిసి మాట్లాడుకోవడం చూసి కోపంతో రగిలిపోతాడు యష్. విన్నీ మాట్లాడుతూ ఇంతకుముందు వేద అంటే నా ఫ్రెండ్ పేద మాత్రమే అనుకునేవాడిని కానీ వేద అంటే ఒక ఫ్యామిలీ. నీకు నీ భర్త పెద్ద గీత నేను చిన్న గీత అయినా కూడా నాకు సంతోషమే అంటాడు విన్ని.