ఈ రోజు ఎపిసోడ్ లో యష్, వేద,కుషి ముగ్గురు కలిసి గుడికి వెళ్తారు. అప్పుడు ఖుషి అమ్మానాన్న ఇద్దరు హ్యాపీ మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా అని అంటుంది. నిన్నటి వరకు నేను చాలా బాధగా ఉన్నాను తెలుసా అని అనగా ఎందుకు అమ్మ అని అనడంతో నువ్వేమో అమ్మమ్మకు యాక్సిడెంట్ అయిందని చెప్పి బాధలో ఉన్నావు డాడీ ఏదో టెన్షన్స్ లో ఉన్నాడు. అప్పుడు నేను స్కూల్లో గణపతి దగ్గరికి వెళ్లి మిమ్మల్ని ఇద్దరినీ కలపమని అడిగాను ఆ దేవుడు నా కోరిక తీర్చారు మీరిద్దరూ కలిసిపోయారు అనడంతో వేద, యష్ ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు వేద నిజంగానే నువ్వు బాధ పడ్డావా ఖుషి అనడంతో అవునమ్మా నాకు మీరు తప్ప ఎవరు ఉన్నారు అని అంటుంది. సరే మీరిద్దరూ కలిసి నాకు ఒక మాట ఇవ్వాలి.