Ennenno Janmala Bandham: ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్న యష్.. ఈర్ష్యతో రగిలిపోతున్న మాళవిక!

First Published Apr 24, 2023, 11:39 AM IST

Ennenno Janmala Bandham: స్టార్ మాలో ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకుల హృదయాలని గెలుచుకొని మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. భార్య భవిష్యత్తు కోసం తపన పడుతున్న ఒక భర్త కథ ఈ సీరియల్. ఇక ఈరోజు ఏప్రిల్ 24 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
 

ఎపిసోడ్ ప్రారంభంలో ఏం జరిగింది.. ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు.. వేద వదిన మీద కోపం వస్తే తిట్టు అంతేకానీ ఇలా విడాకులు ఇవ్వకు అని బ్రతిమాలుతాడు వసంత్. ఇంతలో వేద యష్ కి ఫోన్ చేస్తుంది. అమెరికా వెళ్తున్నారంట నాకు చెప్పనేలేదు. అయినా మీరే వెళ్లాలా వసంత్ ని పంపించొచ్చు కదా అంటుంది వేద. ఇది వసంత్ వల్ల అవ్వదు నేనే వెళ్లి చేయాలి. అయినా పది రోజుల్లో తిరిగి వచ్చేస్తాను అంటాడు యష్. ఇబ్బందిగా ఫోన్ పెట్టేస్తుంది వేద. తనని బాధపెడుతున్నందుకు యష్ కూడా బాధ పడతాడు. అది చూసిన వసంత్ నువ్వు చెప్పిన పని నేను చేయలేను నన్ను వదిలేయ్ అంటాడు. 

 ఒక అన్నగా నేను చెప్పిన పని చేసి తీరాలి, నేను అమెరికా లో ఉండిపోతున్నట్టు ఫ్లైట్ ఎక్కే వరకు ఎవరికీ చెప్పకు. నేను వెళ్ళిన తర్వాత ఈ డైవర్స్ నోటీస్ మీ వదినకి ఇవ్వు అంటాడు యష్. ఒక అన్నగా రాముడు చెప్పాడని లక్ష్మణుడు సీతను తీసుకెళ్లి అడవిలో వదిలేశాడు. ఆ మచ్చ లక్ష్మణుడి జీవితంలో అలాగే ఉండిపోయింది అంటాడు వసంత్. నేను చెప్పిన పని చేయకపోతే నామీద ఒట్టే అంటూ తన మీద ఒట్టు వేసుకుంటాడు యష్. కన్నీరు పెట్టుకుంటూ నువ్వు చెప్పినట్లే చేస్తాను అంటూ బాధగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు వసంత్.

Latest Videos



వసంత్ బాధని చూడలేక.. నేను కసాయి వాడిని కాదు నాతో మీ వదిన ఉంటే తనకి భవిష్యత్తు ఉండదు, తన భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాను అనుకుంటాడు యష్. మరోవైపు వేద ఏదో లెటర్ రాస్తూ ఉంటుంది. అదే టైంలో విన్నీ ఫోన్ చేస్తాడు. కరెక్ట్ టైం కి ఫోన్ చేశావు మా ఆయన బాంబు పేల్చారు సడన్ గా అమెరికా ప్రయాణం పెట్టుకుంటున్నారు పది రోజులు అక్కడే ఉంటారంట అంటుంది వేద. పది రోజులే కదా అందులో బాధపడటానికి ఏముంది అంటాడు విన్ని. ఆయన అమెరికా వెళ్లే లోపే నా మనసులో ఫీలింగ్స్ చెప్పాలనుకుంటున్నాను. అందుకే లెటర్ రాస్తున్నాను అంటూ తనులా రాసిన లెటర్ ని చదువుతుంది వేద.

ఇంకా ఆపు ఈ లెటర్ చదివితే పది రోజుల్లో రావడం కాదు రావాలనుకునేవాడు ఏకంగా అక్కడే సెటిల్ అయిపోతాడు. అయినా ఈ లవ్ లెటర్లు, ఈ పోయెట్రీలు ఇవన్నీ అవసరమా నీ మనసులో ఫీలింగ్ ని స్ట్రైట్ గా ఫేస్ టు ఫేస్ చెప్పు. ఒక క్యాండిలైట్ డిన్నర్ ప్లాన్ చేసి నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు అంటాడు విన్ని. థాంక్స్ విన్ని అందుకే నిన్ను నా బెస్ట్ ఫ్రెండ్ అనేది కరెక్ట్ టైం కి కరెక్ట్ సజెషన్ ఇచ్చావు అంటూ ఆనందంగా ఫోన్ పెట్టేస్తుంది వేద. మరోవైపు ఆఫీసుకు వచ్చిన వేదకి వసంత్ ఎదురవుతాడు.

మీ అన్నయ్య ఏరి.. ఉన్నట్టుండి సడన్గా అమెరికా వెళ్తారంట. పది రోజులు వరకు రారంట కనీసం ఈ ఒక్క రోజైనా నాకు టైం ఇవ్వరా అంటూ నిలదీస్తుంది. మీ అన్నయ్యని డిన్నర్ కి తీసుకెళ్లడానికి వచ్చాను అంటుంది వేద. ఆమె అంత హుషారుగా ఉండటం చూసి యష్ అన్న మాటలు గుర్తు తెచ్చుకొని బాధపడతాడు వసంత్. అన్నయ్య మీటింగ్ లో ఉన్నాడు ఇప్పుడు రాడేమో అంటాడు. నేను తీసుకు వెళ్తాను కదా అంటూ యష్ దగ్గరికి వస్తుంది వేద. పదండి బయటకు వెళ్దాము అంటుంది. ఎక్కడికి అంటాడు యష్. చెప్తే కానీ రారా, 24 గంటల్లో మీరు అమెరికా వెళ్ళిపోతున్నారు మళ్ళీ పది రోజుల వరకు రారు కనీసం ఒక గంట అయినా నాతో టైం స్పెండ్ చేయండి. 

పదండి అలా రెస్టారెంట్ కి వెళ్లి ఒక గంట ఎంజాయ్ చేసి వద్దాము అంటుంది వేద. నేను లేకపోతే నీ లైఫ్ ఇంకా హ్యాపీగా ఉంటుంది అనుకున్న యష్ ఆమె ప్రపోజల్ కి ఓకే చెప్తాడు. బయటికి వచ్చిన తర్వాత వసంత్ తో మీ అన్నయ్య రారు అన్నావు.. చూసావా అన్ని క్యాన్సిల్ చేసుకుని నాతో పాటు వస్తున్నారు అంటూ గొప్పగా చెప్తుంది వేద. వసంత్ యష్ వైపు చూస్తాడు. వేదతో వెళ్తూ యష్ కూడా వసంత్ వైపే చూస్తూ వేదతో వెళ్ళిపోతాడు. యష్ నీతో పాటు శాశ్వతంగా దూరమైపోవటానికి వస్తున్నాడు. యష్ నువ్వు తప్పు చేస్తున్నావు, నాతో తప్పు చేయిస్తున్నావు అంటూ బాధపడతాడు వసంత్. తర్వాత వేదవాళ్లు రెస్టారెంట్ కి వెళ్తారు. 

వాళ్లని రిసీవ్ చేసుకుని ఈ రోజు మా రెస్టారెంట్ అనివర్సరీ ఇక్కడికి వచ్చినవాళ్ళలో బెస్ట్ కపుల్ ని పిక్ చేసుకుని వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాము, అందుకు మీరు ఒక గేమ్ ఆడాలి  అంటుంది లేడీ వెయిటర్. ఇవన్నీ అవసరమా అంటాడు యష్. నాకోసం అంటూ యష్ ని తనతో పాటు తీసుకు వెళ్తుంది వేద. గేమ్ లో 20 కి 19 పాయింట్లు సంపాదిస్తుంది. చాలా బాగా స్కోర్ చేశారు అంటూ యష్ ని కూడా గేమ్ ఆడమంటుంది వెయిటర్. ఆలోచనలో పడతాడు యష్. తరువాయి భాగంలో డాన్స్ చేస్తున్న వేద దంపతులను చూసి ఈర్ష్య పడుతుంది మాళవిక. మీ ఇద్దరినీ ఎప్పటికీ కలవనివ్వను అనుకుంటుంది.

click me!