మీరు కుట్రలు, కుతంత్రాలు చేసి గెలిచారు అంటాడు మహేంద్ర. అలాంటి చేతకాని మాటలు మాట్లాడకండి ఎలా గెలిస్తే ఏముంది కావలసింది రిజల్ట్ అంటాడు సౌజన్య రావు. ఇంతకీ ఎప్పుడు మీ కాలేజ్ మా కాలేజీలో మెర్జ్ అవుతుంది, నువ్వు టైం చెప్తే మన కాలేజీలో రెండు కలిసిపోయినట్లుగా మీడియా వాళ్ళని పిలిచి చెబుదాము అంటాడు సౌజన్య రావు. అప్పుడే అక్కడికి వసుతో పాటు వచ్చిన జగతి కచ్చితంగా పిలుద్దాము వాళ్లు వస్తే మీరు ఎలాంటి కుట్రలు చేసి పర్మిషన్ తెచ్చుకున్నారో చెబుదాము అంటుంది. అంతకన్నా ముందు మనం ఒకటి వినిపించాలి మేడం అంటూ ఒక ఆడియో వినిపిస్తుంది వసు.